Health Benefits: గొంతులో నొప్పి వస్తుందా..ఇలా చేస్తే వెంటనే ఉపశమనం చాలా మందికి తరచూ గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు, లేదా నీరు తాగేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. మింగడం కూడా కష్టంగా ఉంటుంది. జలుబు వల్ల గొంతులో వాపు వచ్చినప్పుడు మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని నియమాలతో ఈ సమస్యలును దూరం చేయవచ్చు. By Vijaya Nimma 14 Nov 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి ఇలా గొంతునొప్పి ఉన్నప్పుడు వేడి వేడి పదార్థాలను తీసుకుంటే కొంత వరకు రిలీఫ్‌గా ఉంటుంది. అంతేకాకుండా గొంతునొప్పి ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం. గొంతు సంబంధిత సమస్యలు ఉన్నవారు సిట్రస్ పండ్లను తినకూడదని నిపుణులు అంటున్నారు, నిమ్మ, కివీ ఫ్రూట్, ఆరెంజ్, ఫైనాపిల్లాంటి పండ్లను తినకూడదని చెబుతున్నారు. ఒక వేళ ఇవి తింటే మన గొంతులో ఇర్రిటేషన్ వస్తుంది. దీంతో గొంతు నొప్పి మరింత పెరుగుతుంది. పచ్చళ్లు, చాట్ మసాలా మానేస్తే బెటర్ అంతేకాకుండా గొంతు నొప్పి ఉన్నప్పుడు టమాటాలు కూడా తీసుకోవద్దు. టమాటాల్లో ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గొంతులో నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా చింతపండు కూడా గొంతు నొప్పిని మరింత పెంచుతుంది. ఇందులో ఉండే పుల్లదనం మన గొంతులో వాపును ఎక్కువ చేస్తుంది. అలాగే దురద కూడా వస్తుంది. అందుకే చింతపండును దూరంగా ఉంచడం మంచిది. మరోవైపు పచ్చళ్లు, చాట్ మసాలా కూడా గొంతు సమస్యలు ఉన్నవారు మానేస్తే బెటర్. గొంతునొప్పి ఉన్నప్పుడు రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తింటే మంచిది. నూనెతో చేసిన ఆహార పదార్థాలు, వేపుళ్లను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: చెవిపోటును చిటికెలో పోగొట్టే చిట్కాలు మీ కోసం మామూలుగా అయితే పెరుగుతిన వచ్చు కానీ గొంతు నొప్పి ఉన్నవారు పెరుగును తీసుకుంటే శ్లేష్మం ఎక్కువ అవుతుంది. గొంతునొప్పి కూడా బాగా వస్తుంది. అందుకే పెరుగును తినకపోవడమే మంచిది. బ్రెడ్స్, చిప్స్‌తో పాటు మద్యం తాగడం కూడా మానివేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కెఫీన్ కలిగి ఉండే టీ, కాఫీలను కూడా తీసుకోవద్దు. ఇవి త్రాగినట్లైతే మన గొంతు భాగం పొడిగా మారి సమస్య అధికం అవుతుంది. కూల్ డ్రింకులు, జ్యూసులు తాగడం కూడా తగ్గించాలి. ఇలా కొన్ని నియమాలు పాటిస్తే గొంతునొప్పి త్వరగా తగ్గిపోయి మంచి ఉపశమనం కలుగుతుందని వైద్యులు అంటున్నారు. #health-benefits #throat #immediate-relief మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి