Times Now Survey : దేశంలో మళ్లీ మోదీదే హవా...తగ్గేదేలేదు..!!

ఓ సర్వే ఇండియా కూటమికి కాలరాత్రిని మిగిల్చింది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఇండియా కూటమికి టైమ్స్ నౌ సర్వే షాక్ కు గురి చేసింది. మరోసారి కేంద్రంలో ప్రధాని మోదీనేని సర్వేలో తేలింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని మోదీ అవుతారని పేర్కొంది.

New Update
PM Modi: ప్రపంచంలో మోదీనే తోపు,టాపూ..గ్లోబల్ లీడర్స్ లో మరోసారి నరేంద్రుడిదే ఫస్ట్ ప్లేస్..!!

Times Now Survey on Modi: దేశంలో 2024 లోకసభ ఎన్నికల ఫీవర్ షురూ అయ్యింది. ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఎవరికివారే గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మధ్య ఉంటుందని అందరికీ తెలిసిందే. దేశం విషయం పక్కన పెడితే...పార్లమెంట్ కు ప్రధాని మార్గమైన యూపీ గురించి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెండు దఫాల్లో ఆ రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుచుుకుని కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ (BJP). ఈ సారికూడా బంపర్ మెజార్టీ వస్తుందని తాజా సర్వే తేల్చేసింది.

ఇది కూడా  చదవండి: ఏపీలో తగ్గని వైసీపీ హవా…టైమ్స్ నౌ సంచలన సర్వే…వివరాలివే..!!

అయితే తాజా సర్వే ప్రకారం మోదీ (Modi) మూడోసారి గెలిచి నెహ్రూ రికార్డును దాచే అవకాశం ఉందని అంచాన వేసింది. ఎన్డీయే కూటమి (NDA Alliance) 318 సీట్లతో స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని, విపక్ష కూటమికి 175 , ఇతరులకు 50సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఎన్డీయే కూటమిలోనూ బీజేపీ సొంతంగానే మెజార్టీ మార్క్ దగ్గర ఉంటుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఆమధ్య ఎన్డీటీవీ, సీఎస్డీఎస్ సర్వేలోనూ దాదాపు ఇదే ఫలితం వెల్లడయ్యింది. 43శాతం మంది మోదీని ప్రధాని అని చెబితే...16శాతం రాహుల్ (Rahul Gandhi) కు సపోర్ట్ చేశారు. పార్టీ పరంగా 39శాతం బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. ఇతర సర్వేల్లోనూ ఇవే అంచనాలున్నాయి.

ఇది కూడా  చదవండి: ఏపీలో టీడీపీదే విజయం.. ఆత్మసాక్షి సర్వే చెప్పిన లెక్కలు ఇవే..!!

ఎన్డీయేకి, బీజేపీకి ఇప్పటికే మోదీనే తిరుగులేని శక్తి. మోదీ పేరు, పాలనే మళ్లీ గెలిపిస్తుందన్న ధీమా అటు మిత్రపక్షాల్లోనూ ఉంది. ఇక ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా ఎదిగిన మోదీ నాయకత్వంలో భారీ మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సర్వేల్లో తేలింది. అయితే ఉత్తరాదిపై బీజేపీ ధీమాతో ఉన్నప్పటికీ సౌత్ లో మాత్రం సీట్లు పెంచుకునేందుకు ఆ పార్టీకి సవాల్ గానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు