Opinion Poll : ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం.. సంచలన సర్వే.. సీట్ల లెక్కలివే..!! మరికొన్ని రోజుల్లో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అయితే మధ్యప్రదేశ్ కు సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ...కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. అధికార బీజేపీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్ పార్టీకి గెలుచుకునే స్థానాలెన్నో చూద్దాం. By Bhoomi 30 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టిపోటీ నెలకొననుంది. ఇప్పటికే ఇరు పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. బీజేపీ మాదే విజయం అంటుంటే...కర్నాటక ఎన్నికల ఫలితం రిపీట్ అవుతుందని కాంగ్రెస్ తెగేసి చెబుతోంది. అయితే మధ్యప్రదేశ్ కు సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ...కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. సర్వే ప్రకారం రెండు పార్టీల మధ్య హోరాహోరా పోరు ఉంటుందని అంచనా వేసింది. ప్రతిపార్టీకి 42శాతానికి పైగా ఓట్ షేర్ వస్తుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఇది కూడా చదవండి: భారీగా పెరగనున్న బైక్, స్కూటర్ ధరలు.. ఎంతంటే..!! మధ్యప్రదేశ్ ఓవరాల్ ఒపీనియన్ పోల్ లెక్కల ప్రకారం బీజేపీ 42.80శాతం ఓట్ షేర్ తో 102-110 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అటు కాంగ్రెస్ 43. 80శాతం ఓట్ షేర్ తో 118-128 సీట్లను సాధిస్తుందని అంచనా వేయగా...ఇతర పార్టీలు 13.40శాతం ఓట్లు 0-2 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మధ్యప్రదేశ్ రీజియన్ వారీగా లెక్కచూస్తే: మాల్వా నిమార్‌లో కాంగ్రెస్ 41-45 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా..ఇక్కడ బీజేపీ వెనకబడుతుందని అంచనా వేసింది. 20-24 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. అటు మహాకౌశల్‌లో, బీజేపీ ఆధిక్యంలో ఉంటుందని 18-22 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా, కాంగ్రెస్ మాత్రం 16-20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక గ్వాలియర్ చంబల్‌లో, బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ 26-30 సీట్లతో మెరుగ్గా ఉండగా.... ఈ ప్రాంతంలో బీజేపీ దాదాపు 4-8 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. మధ్యభారత్‌లో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగ్గా రాణించడంతోపాటు... దాదాపు 22-24 సీట్లు కైవసం చేసుకుంటుందని టౌమ్స్ నౌ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. అయితే కాంగ్రెస్‌కు 12-14 సీట్లు వస్తాయని అంచనా వేసింది. వింధ్యలో ఓటర్లు బీజేపీకే పట్టం కడతారని తేలింది. ఇక్కడ బీజేపీ 19-21 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 8-10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్న బుందేల్‌ఖండ్‌లో, బీజేపీదే పైచేయి అని సర్వేలో తేలింది. ఇక్కడ బీజేపీకి 13-15 సీట్లు రాగా...కాంగ్రెస్ 11-13 స్థానాలను కైవసం చేసుకుంటుందని తెలిపింది. ఇది కూడా చదవండి: కేవలం రూ.5 లక్షలకే అదిరిపోయే కార్.. ఓ లుక్కేయండి..!! హోరాహోరీ పోటీ: మొత్తానికి అధికార బీజేపీకి, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని...స్పష్టం చేసింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో, కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాలనలో బీజేపీని గద్దె దించింది. బిజెపికి 109 స్థానాలకు వ్యతిరేకంగా 114 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2018లో మధ్యప్రదేశ్‌లో చివరి ఎన్నికలు నవంబర్ 28, 2018న మొత్తం 230 స్థానాలకు ఒకే దశలో జరిగాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11, 2018న జరిగింది. ఇది కూడా చదవండి: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!! కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ 2018లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, 15 నెలల తర్వాత, బీజేపీలో చేరిన పార్టీ సహచరుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో... 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కమల్ నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బిజెపి నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ 4వ సారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే తాజాగా టౌమ్స్ నౌ చేసిన సర్వేలో మాత్రం ఈసారి బీజేపీకి ఓటమి తప్పదని...కాంగ్రెస్ దే విజయమంటూ సంచలన సర్వేను బయటపెట్టింది. #congress #bjp #madhyapradesh #times-now-etg-opinion-poll #overall-opinion-poll మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి