Weight Loss Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకునేందుకు వ్యాయామాలు, ఎక్సర్ సైజులు, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది అయితే గంటల తరబడి జిమ్ముల్లో గడుపుతుంటారు. అయినా కూడా ఫలితం ఉండదు. పెరుగుతున్న శరీర కొవ్వును తగ్గించడానికి, మెరుగైన శరీర ఆకృతి కోసం అనేక చిట్కాలను కూడా పాటిస్తుంటారు. కానీ ఈ నేచురల్ డ్రింక్స్ ప్రతిరోజూ తాగినట్లయితే...మీరు సులభంగా బరువు తగ్గుతారు. అవేంటో చూద్దాం.

New Update
Weight Loss Tips: ఈ 5 డ్రింక్స్ తాగితే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..!!

Weight loss Tips in Telugu: రుచిగా ఉంది కదా అని అతిగా తినడం, ఎక్కువ శారీరక శ్రమ లేపోవడం, వ్యాయామాలను జోలికి వెళ్లకపోవడం, జన్యుపరమైన కారణాలు, జంక్ ఫుడ్, ఇవ్నీ కూడా బరువు పెరిగేందుకు కారణాలు. నేటికాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో భారీగా పెరిగిన శరీర బరువును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా ఫలితం మాత్రం శూన్యం. అలాంటి వారి కోసం మేము వంటింట్లో దొరికే కొన్ని బరువు తగ్గించుకునే డ్రింక్స్ పరిచయం చేస్తున్నాం. వీటి వల్ల బరువు తగ్గడమే కాదు..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అయితే ఈ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. జీరా వాటర్ (Jeera water):
జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. రెండు స్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!!

2. పుదీనా నీళ్లు(Mint Water):
పుదీనా కూడా బరువు తగ్గించుకోవడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీర్ణశక్తి మెరుగ్గా జరిగేందుకు సహాకరిస్తుంది. జీవక్రియను పెంపొందించడంతోపాటు శరీరంలో అధిక క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. 10 పుదీనా ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. వీటిని మంచినీటిలో వేయాలి. గ్యాస్ స్టౌ మీద పెట్టి సగానికి మరగనివ్వాలి. అందులో కాస్త నిమ్మరసం పిండుకుని చల్చార్చి తాగాలి.

3. సోంపునీళ్లు(Saunf Water):
సోంపును భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేశక్తి సొంపుకు ఉంటుంది. దీంతో జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కడుపు నిండిన భావనను కలిగించడంతో ఎక్కువగా తినకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఒక స్పూన్ సొంపును తీసుకుని నీటిలో వేసి మరగించాలి. ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. దీనివల్ల ఎక్కువగా తినాలనే కోరిక తగ్గడంతోపాటు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

4. మెంతి నీళ్లు(Fenugreek water):
మెంతుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్లు, పీచు పదార్థాల ఉంటాయి. రుచిలో చేదుగా ఉన్నప్పటికీ...ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన ఇళ్లలో మెంతులు తప్పకుండా ఉంటాయి. వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ట్యాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ టిప్ ఇది.

ఇది కూడా చదవండి: నడుము నొప్పి పోవాలంటే.. వెంటనే వీటిని తినండి!

5. చియా వాటర్(Chia Water):
చియా సీడ్స్ మార్కెట్లో విరిగా లభిస్తాయి. వీటిని నీటిలో వేసుకుని 10 నిమిషాల తర్వాత తాగుతే బరువు తగ్గించుకోవచ్చు. వీటిలో ఏ జ్యూస్ లో అయినా జోడించుకోవచ్చు. వీటిని నిత్యం తీసుకున్నట్లయితే పొట్టలో పేరుకుపోయిన కొవ్వులో కరిగిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు