Tillu Square: టిల్లుగాడు వంద దాటేసేలా ఉన్నాడు...

డీజే టిల్లుతో సక్సెస్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్‌తో దాన్ని రిపీట్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం విడుదల అయిన ఈ మూవీకి ఆడియోన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో థియేటర్ల దగ్గర టిల్లు స్క్వేర్‌కు వసూళ్ళ వర్షం కురుస్తోంది.

Tillu Square: టిల్లుగాడు వంద దాటేసేలా ఉన్నాడు...
New Update

Tillu Square Collections: డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ అయింది. మొదటి సినిమాలో రాధిక అంటూ టిల్లు అల్లరి చేస్తే ఇందులో లిల్లీ అంటూ తెగ అల్లరి చేసేశాడు. వన్ లైనర్‌లతో అలరిస్తున్న ఈ మూవీ బాక్సీఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. శుక్రవారం విడుదైల ఈ మూవీ ఫస్ట్ డేనే మంచి టాక్ తెచ్చుకుని 23.7 కోట్ల గ్రాస్ రాబట్టిందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక రెండో రోజు, మూడో రోజు దాని కన్నా ఎక్కువే కాసులు కురిపించిందని తెలుస్తోంది. ఇప్పటివరకు సేల్ అయిన టికెట్లు, అద్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే టిల్లు స్క్వేర్ నిర్మాత సూర్యదేవన నాగవంశీ చెప్పినట్లు టిల్లుగాడు బాక్సీఫీసు దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంలా కనిపిస్తోంది.

టిల్లు స్క్వేర్ సినిమాకి అనుకున్నట్టుగానే యూత్ ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బుక్ మై షోలో ప్రతి గంటకు 15 వేల నుంచి 20 వేల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఎ సెంటర్లు, మల్టీప్లెక్స్‌లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. బి, సి సెంటర్లు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్ సీస్ లోనూ టిల్లు గాని ర్యాంపేజ్ కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఎవరూ ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా అమెరికాలో ఇప్పటికే వన్ మిలియన్ గ్రాస్ దాటినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్ల నుంచి $503,218 రాబట్టగా.. శుక్రవారం $483,497 కలుపుకొని మొత్తం $986,715 వసూళ్లు అందుకుంది. అయితే శనివారం ఎర్లీ మార్నింగ్ షోల గ్రాస్‌తో 1 మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సిద్ధు జొన్నలగడ్డ మొదటిసారి వన్ మిలియన్ హీరోగా నిలిచాడు.

ఇక ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాదిలో విడుదల అయిన సినిమాల్లో టిల్లు స్క్వేర్ సెకండ్ హయ్యెస్ట్ తెలుగు గ్రాసర్‌గా నిలిచే అవకాశాలున్నాయి. టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) , అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి సిద్ధు స్వయంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి మూజిక్ కంపోజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు.

Also Read:INIDA Bloc Rally: ప్రధాని మోదీనే కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు-సునీత కేజ్రీవాల్

#telugu #movies #tillu-square #siddhu-jonnalagadda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe