Tilak Verma: బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తిలక్‌ వర్మ స్థానం అదే.!

తెలుగు తేజం యువ క్రికెటర్‌ తిలక్ వర్మ ఆసియా కప్‌ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మినీ టోర్నీలో భాగంగా భారత్ తన మొదటి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ద్వారా తిలక్ వర్మ వన్డే టీమ్‌లోకి వచ్చా అవకాశం ఉంది.

IND VS SA: తెలుగు కుర్రాడికి షాక్‌.. మూడో వన్డే నుంచి ఔట్.. తుది జట్టు ఇదే!
New Update

యువ సంచలనం తిలక్‌ వర్మ వన్డే జట్టులోకి రాబోతున్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఈ తెలుగు కుర్రాడు విదేశీ గడ్డపై అద్భుత ప్రదర్శన చేసి ఆసియా కప్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు జరుగబోతున్న ఈ మినీ టోర్నీలోని తుది జట్టులో తిలక్‌వర్మ స్థానం సంపాధించే అవకాశం ఉందని భారత మాజీ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయ పడ్డారు. కాగా ఈ ఎడమ చేతి బ్యాటర్‌ను టీమ్‌లో కీలకమైన 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని ఆయన తెలిపారు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో యువ క్రికెటర్‌ని 4వ స్థానంలో బ్యాంటిగ్‌కు పంపిస్తే టీమ్‌కు ఉపయోగం ఉంటుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.

publive-image

మరోవైపు ఆసియా కప్‌లో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే తిలక్‌ వర్మ చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగే మ్యాచ్‌ ద్వారా వన్డే ఫార్మాట్‌ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేయడం ఖాయమనే చెప్పాలి. పాక్‌తో ఆడనున్న తుది జట్టును ఎంపిక చేసుకున్న సునీల్‌ గవాస్కర్‌.. తన టీమ్‌లో ముగ్గురు స్పీడ్‌ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీలకు చోటిచ్చాడు. నాలుగో బౌలర్‌గా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఎంపిక చేసుకున్నాడు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్దీప్‌ ఉంటారని తెలిపాడు. టీమ్‌ ఓపెనర్లుగా శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మలకు గవాస్కర్‌ అవకాశమిచ్చారు.

publive-image

దిగ్గజ క్రికెటర్‌ ఎంచుకున్న బ్యాటర్లలో టాప్‌ ఆర్డర్‌ను చూస్తే.. ఓపెనర్ల తర్వాత నంబర్‌ 3లో విరాట్‌ కోహ్లిని ఎంచుకున్నట్లు తెలిపాడు. ఇక కీలకమైన నాలుగో స్థానంలో యువ బ్యాటర్‌ తిలక్‌ వర్మను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. తిలక్‌ వర్మతో పాటు ఆ స్థానానికి శ్రేయస్‌ అయ్యర్‌ పోటీపడుతున్నా.. తిలక్‌ ఎడమచేతి బ్యాటర్‌ కావడంతో అతనికి స్థానం ఇచ్చానన్నారు. వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ను తీసుకున్నాడు. ఓవరాల్‌గా ఆసియా కప్‌లో పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో గవాస్కర్‌ ఎంచుకున్న టీమ్‌ను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

#pakistan #asia-cup #sunil-gavaskar #odi-format #tilak-verma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe