గాంధీ భవన్‌లో టికెట్ల జాతర....కాంగ్రెస్ వ్యూహం అదేనా...!

గాంధీ భవన్‌ లో టికెట్ల జాతర నడుస్తోంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల ఆశావాహుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని కోసం ఇప్పటికే నమూనా అప్లికేషన్, దరఖాస్తులను ఫైనల్ చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తు చేసుకోవాలని పార్టీ వెల్లడించింది. అయితే దీని వెనుక భారీ వ్యూహం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Telangana Congress: టిక్కెట్లు ఇవ్వకుంటే ఏం చేద్దాం?.. భగ్గుమంటున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు
New Update

కర్ణాటక విజయంతో కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంది. కన్నడ నాట లభించిన విజయంతో ఇటు తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. దీంతో కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ఆశావాహుల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి అనే విషయంలో హస్తం పార్టీ అధినాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే దరఖాస్తుల ప్రక్రియకు తెరలేపినట్టు తెలుస్తోంది. దరఖాస్తు ప్రక్రియ వెనుక ఎవరి ఊహలకు అందని వ్యూహాలను అదిష్టానం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

గాంధీ భవన్‌లో సీట్ల జాతర...!

గాంధీ భవన్ లో సీట్ల జాతర నడుస్తోంది. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ల ఆశావాహుల నుంచి పార్టీ దరఖాస్తులను కోరుతోంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వాళ్లు ఎల్లుండి నుంచి దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ వెల్లడించింది. దీని కోసం ఇప్పటికే దరఖాస్తు రుసుము, నమూనా అప్లికేషన్ లను కూడా ఫైనల్ చేసింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు.

పలు దఫాల్లో వడబోత...!

దరఖాస్తు ప్రక్రియ అనంతరం వడపోత ప్రక్రియను చేపట్టనున్నారు. మొదట వచ్చిన దరఖాస్తులన్నింటినీ పీసీసీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. అనంతరం ఓ జాబితాను తయారు చేసి ఏఐసీసీకి పంపనున్నారు. అక్కడ ఏఐసీసీ నేతలు దీనిపై సమగ్రంగా పరిశీలన చేయనున్నారు. పార్టీ అంతర్గత సర్వేలు, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సర్వేలు అన్నీ బేరీజు వేసుకుని మరో జాబితాను తయారు చేయనున్నారు. ఆ తర్వాత దానిపై అధిష్టానంతో చర్చలు జరిపి తుది జాబితాను విడుదల చేయనున్నారు.

బయోడేటా వెరిఫికేషన్...!

దరఖాస్తులో పలు కీలక విషయాలను సేకరిస్తున్నారు. పార్టీలో ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు.. ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారారు. ఒక వేళ కాంగ్రెస్ ను వీడి మళ్లీ పార్టీలో చేరితే ఆ విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. దీంతో అభ్యర్థికి పార్టీతో వున్న అనుబంధం, పార్టీలు మారిన చరిత్ర వంటి విషయాలన్నీ అధిష్టానం దృష్టికి వెళ్లే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు.

ఆ మెసేజ్ పంపేందుకేనా...!

కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతులను ఫాలో అవుతుందనే విషయాన్ని అటు పార్టీ నేతల్లోకి, ఇటు ప్రజల్లోకి పంపేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు, జూనియర్లు తేడా లేదని అర్హత ఉంటే ఎవరైనా పదవులు ఆశించ వచ్చనే విషయాన్ని పార్టీ నేతలకు తెలిపేందుకు ఈ ప్రక్రియను చేపట్టినట్టు  పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

నేతలకు ఝలక్ ఇచ్చేందుకేనా...!

చాలా మంది సీనియర్లు తమకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫార్మ్ అనే భావనలో ఉన్నారు. అలాంటి వారికి ఝలక్ ఇచ్చేందుకే ఈ ప్రకటన చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సభ్యులెవరైనా పార్టీ విజయం కోసమే పని చేయాలని, లేదంటే మీ వెనుక మరో నలుగురు పోటీ పడుతున్నారనే విషయాన్ని గుర్తు చేసేందుకే ఈ దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టినట్టు విశ్లేషిస్తున్నారు.

రెబెల్స్ ను గుర్తించేందుకేనా...!

ఎన్నికల ముందు ప్రతి పార్టీకి రెబెల్స్ బెడద అనేది తల నొప్పిగా మారుతుంది. ఈ దరఖాస్తుల ద్వారా టికెట్ ఆశావాహులు ఎవరనే విషయం ముందే తెలుస్తుంది కాబట్టి వాళ్లను ముందు నుంచే బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒక వేళ ఏ అభ్యర్థి అయినా ముందే హ్యాండ్ ఇచ్చినా మరో నేత అప్పటికే రెడీ మేడ్‌గా సిద్దంగా వుంటారని ఆలోచనలు చేస్తున్నట్టు విశ్లేషణలు చేస్తున్నారు.

#congress #applications #sunil-kanugolu #mla-tickets #strategy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe