Guntur Kaaram ticket rates:పండగ దగ్గర పడుతోంది. సీజన్ సినిమాల సందడి మొదలైంది. మొన్నటివరకు థియేటర్స్ గురించి హాట్ వార్తలు నడిచాయి.ఇప్పుడు బుక్కింగ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం అనుమతులు యిస్తోంది. నిన్ననే తెలంగాణ ప్రభుత్వం గుంటూరుకారం సినిమాకు రోజుకు ఆరు షోస్ ప్రదర్శించుకునేందుకు, టికెట్స్ ధరలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడాగుంటూరు కారం చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టికెట్ కు 50 రూపాయలు పెంచుకునే వెసులుబాటు
జనవరి 12 న గ్రాండ్ గా రిలీజవుతోన్న గుంటూరు కారం మూవీ ఏపీ ప్రభుత్వం టికెట్ కు 50 రూపాయలు పెంచుకునే విధంగా అనుమతించింది. ఈ పెరిగిన టిక్కెట్ రేట్లు జనవరి 12 నుండి 10 రోజుల పాటు వర్తిస్తాయని తెలియజేసారు. అయితే ఈ మూవీకి బెన్ఫిట్ షోస్ ఉంటాయా లేవా అనేది మాత్రం క్లారిటీ రాలేదు. .పాన్ ఇండియా మ్యానియా నడుస్తోన్న ప్రస్తుత తరుణంలో ఓ రీజినల్ సినిమా ఈ రేంజ్లో సెన్సేషనల్ క్రియేట్ చేయడం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారని తెలుస్తోంది.
అతడు - ఖలేజా - గుంటూరు కారం
త్రివిక్రమ్ , మహేష్ కాంబో అంటే కావాల్సినంత వినోదం , పంచు డైలాగులు , మనసుని హత్తుకునే భావోద్వేగాలు పుష్కలంగా ఉంటాయి. అతడు సినిమాలో మహేష్ బాబు పార్థుగా అలరిస్తే .. ఈ మూవీలో రమణ గా అలరించనున్నారు. అతడు లో మహేష్ బాబు అనాధ. గుంటూరు కారంలో మహేష్ బాబు తల్లి రమ్యకృష్ణ అనాథలా వదిలేస్తుందని ట్రైలర్ లో చెప్పకనే చెప్పారు . అతడిలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అందరిని ఆకట్టుకుంది., ఈ మూవీలో మసైతం పాలిటిక్స్ పుస్కజాలంగా ఉందని ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతోంది. సో.. త్రివిక్రమ్ మార్క్ తో ఊరమాస్ ఎంటరిటైనర్ గా అలరించేందకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే తెలంగాణ లో బుక్కింగ్స్ మొదలయ్యాయి. ప్రసాద్ మల్టీఫ్లెక్స్లో డే వన్ కే 45షోస్ ప్రదర్శించడం అంటే మామూలు మాటలు కాదు
శ్రీలీల స్టెప్పులు ప్రధాన ఆకర్షణ
గుంటూరు కారం సినిమా ఆరంభం నుంచి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఇప్ప్పుడు పాజిటివ్ సైన్ తో ముందుకుపోతోంది. ఈ చిత్ర విజయంపై మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్రీలీల స్టెప్పులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ఇప్పటివరకు రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే యిట్టె అర్ధం అవుతోంది.,ఈ సినిమాపైన శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది.
Also Read:ప్రసాద్ మల్టీఫ్లెక్స్ లో గుంటూరు కారం ఒక రోజుకి 41 షోస్ తో అల్ టైం రికార్డు