Rain Alert: రెండు రోజుల పాటు ఉరుములు..మెరుపులతో కూడిన వర్షాలు..ఎల్లో అలర్ట్‌ జారీ!

తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు.

New Update
Mumbai: ముంబైకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్

Rain Alert: తెలంగాణలో (Telangana) రాగల రెండురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు.

సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈ క్రమంలో గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు సమాచారం. ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

Also Read: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్

Advertisment
Advertisment
తాజా కథనాలు