Chandrayaan-3: చెరిగిపోని చంద్రయాన్‌-2 జ్ఞాపకాలు.. ఈ సారి మాత్రం ఫినిషింగ్‌ టచ్‌ అదిరిపోద్ది భయ్యా!

చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ అవ్వాలని యావత్‌ దేశం దేవుళ్లకు ప్రార్థిస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు చంద్రయాన్‌ జపం చేస్తోంది. 2019లో చంద్రయాన్‌-2 చివరి మెట్టుపై బోల్తా పడడాన్ని ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు.. నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకుంటూనే ఈసారి మాత్రం ఇస్రో సైంటిస్టులు విజయం సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఆగస్టు 23, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్‌ జాబిల్లిపై కాలు మోపనుంది.

Chandrayaan-3: చెరిగిపోని చంద్రయాన్‌-2 జ్ఞాపకాలు.. ఈ సారి మాత్రం ఫినిషింగ్‌ టచ్‌ అదిరిపోద్ది భయ్యా!
New Update

Chandrayaan 2 memories: అది సెప్టెంబర్‌ 7, 2019.. అర్థరాత్రి ఒంటిగంట దాటింది.. అందరూ గాఢ నిద్రలో ఉండాల్సిన సమయం అది.. కానీ యావత్‌ దేశం మెలుకునే కుర్చుంది. టీవీలకు అతుక్కుపోయింది.. జరుగుతుంది ఏ క్రికెట్‌ మ్యాచో కాదు.. చంద్రయాన్‌-2 జాబిల్లిపై కాలుమోపే క్షణాలు అవి.. అప్పటివరకు కేవలం మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై తమ ల్యాండర్‌ని విజయవంతంగా పంపించగలిగాయి.. అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త సంచలనం సృష్టించేందుకు ఇండియా రెడీ అయ్యింది.. అటు బెంగళూరులోని ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో సైంటిస్టులు, ప్రధాని మోదీ చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.

అక్కడున్న వారి వయసు సగటున 40ఏళ్లు పైనే ఉంటుంది. కానీ ఆ రోజు అంతా చిన్నపిల్లలే.. జాబిల్లివైపు వడివడిగా అడుగులేస్తున్న చంద్రయాన్-2ని చూసి అంతా కేరింతలు కొడుతున్నారు. వారి ముఖాల్లో ఆనందం, ఏదో సాధించాబోతున్నమన్న గర్వం..ఆ ప్రాంగణమంతా సందడే సందడి..

లాస్ట్‌ బంతికి బోల్తా:
జాబిల్లిపై చంద్రయాన్‌-2 ల్యాండర్‌ అడుగుపెట్టేందుకు సమయం దగ్గరపడుతున్న కొద్ది అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ.. గ్యాలరీలో తన సిటులో ఉండి జరుగుతున్నదంతా గమనిస్తున్న మోదీ సైతం టెన్షన్‌ పడుతూ కనిపించారు.. అతి క్లిష్టమైన అన్ని దశాలు దాటిన చంద్రయాన్‌-2 జాబిల్లికి చాలా దగ్గరైంది.. ఇంకా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే ల్యాండర్‌ జాబిల్లిపై దిగుతుంది. అందరి కళ్లు చంద్రయాన్‌-2 రూట్‌పైనే ఉంది. ఇంతలోనే ల్యాండర్‌ తన దశను మార్చుకుంది. అప్పటివరకు అందరి కళ్లలో కనిపించిన ఆనందం.. ఆవిరైపోయింది.. ఏం జరుగుతుందో క్లియర్‌కట్‌గా తెలిసిపోయింది.. నాటి ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ ల్యాండర్‌ దశ మార్చుకున్నట్టు ప్రకటించారు. అప్పటివరుకు చప్పట్లతో మారుమోగిన ఆ ప్రాంతాన్ని మౌనం కమ్మేసింది.. కన్నీళ్లు ధారలు కట్టాయి. శివన్‌ ఒక్కసారిగా ఏడ్చేశారు. అక్కడే ఉండి ఇవన్ని గమనిస్తున్న మోదీ ఆయన్ను ఓదార్చారు.. నిజానికి అప్పటి ప్రయోగాన్ని విఫలం అని అనలేం. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి ల్యాండర్‌ దూసుకుపోవడం చిన్న విషయం కాదు.. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటతో లాస్ట్‌ మినిట్‌లో సేఫ్‌ ల్యాండ్‌ కాలేకపోయిందంతే.

ఈ సారి లాస్ట్ బాల్‌ సిక్స్‌ పక్కా!
చంద్రయాన్‌-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. చంద్రయాన్‌-3కి సర్వశక్తులు ఒడ్డింది.. సైంటిస్టుల ప్రాణం పెట్టి పని చేశారు. చంద్రుడి ఉపరితలంపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది గంటల్లో (ఆగస్టు 23, సాయంత్రం 6:04గంటలకు) లూనార్ టచ్‌డౌన్ అవుతుంది. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్టు జరగడంతో ఇస్రో సైంటిస్టులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అటు ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రికెట్‌ తర్వాత యావత్‌ దేశాన్ని ఒకేతాటిపైకి తీసుకొచ్చినది ఏదైనా ఉందంటే అది చంద్రయాన్‌ ప్రయోగం మాత్రమేనని చెప్పవచ్చు. చంద్రయాన్‌-3 ప్రయోగం గురించి నెట్టింట సెర్చ్‌ చేస్తున్న వాళ్లని చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. చంద్రయాన్‌-3 సక్సెస్‌ అవ్వాలని అందరూ దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. ఇంతలా చంద్రయాన్‌ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకొచ్చింది.. దటీజ్‌ ఇస్రో..!

#modi #chandrayaan-3-moon-landing #chandrayaan #chandrayaan-2
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe