Chandrayaan-3: ఇదిరా ఇండియా అంటే.. ఇస్రోని ఆకాశానికి ఎత్తేసిన అంతర్జాతీయ మీడియా!
ప్రపంచం మొత్తం ఇస్రోకి సలాం కొడుతోంది. భారత్‌పై కారణం లేకుండా కస్సుబుస్సుమనే కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు సైతం ఇస్రో సాధించిన విజయాన్ని కీర్తించకుండా ఉండలేపోతున్నాయి. అమెరికా, యూకే, అరబ్ దేశాల మీడియా సంస్థలు తమ వెబ్‌సైట్స్‌లో బ్యానర్ ఐటెమ్‌గా చంద్రయాన్-3 విజయం గురించే పెట్టుకున్నాయి. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది.