Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు!

Telangana : తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) ప్రకటించింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో అకడకడ వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

సోమవారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతోపాటు నిజామాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మలాజ్‌గిరి, సంగారెడ్డిలో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌ , పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది.

బుధవారం, గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించారు.

Also read: ఇక నుంచి నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ!

Advertisment
తాజా కథనాలు