Chandrababu Lawyers Fee: చంద్రబాబు కోసం రంగంలోని ముగ్గురు దిగ్గజ లాయర్లు.. వారి ఫీజు ఎంతో తెలుసా?

సుప్రీంకోర్టులో చంద్రబాబు కోసం నిన్న దేశంలోని ముగ్గురు టాప్ లాయర్లు అయిన హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపంచారు. వీరు దేశంలోనే అత్యంత సీనియర్ న్యాయవాదులు మాత్రమే కాదు.. అత్యంత ఎక్కువ ఫీజు అంటే రోజుకు లక్షల్లో ఫీజు తీసుకుంటారనే పేరు వీరికి ఉంది.

New Update
Chandrababu case: చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు?? కొద్ది గంటల్లో ఏం జరగబోతోంది?

Chandrababu Lawyers Fee: ప్రస్తుతం ఏపీ రాజకీయమంతా (AP Politics) చంద్రబాబు నాయుడు అరెస్ట్ (Chandrababu Arrest) చుట్టే తిరుగుతోంది. నిత్యం ఏదో కేసు విచారణ, పిటిషన్, నోటీసులు అనే వార్తలే మనకు వినిపిస్తున్నాయి. ఈ కేసుల ప్రారంభం నుంచి టీడీపీ నేతలు దీనిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. చాలా సింపులగా బెయిల్ వస్తుంది.. చంద్రబాబు అరెస్ట్ అయ్యే పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అయితే.. చంద్రబాబు నాయుడు స్వయంగా తాను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పిన సమయంలోనూ అంతా అలా జరగదని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ (TDP) నేతలు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. ఏకంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాని రంగంలోకి దించారు. అరెస్ట్ అయిన రోజే రిమాండ్ కాకుండా బెయిల్ వస్తుందని అంతా భావించారు. కానీ చంద్రబాబుకు కేసు రిమాండ్ విధించడంతో అంతా షాక్ కు గురయ్యారు. తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై కూడా టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. క్వాష్ పిటిషన్ ను కొట్టేయడంతో టీడీపీ నేతలు మరో సారి షాక్ కు గురయ్యారు. చంద్రబాబు కస్టడి పిటీషన్ పై కూడా ఇదే జరిగింది. ఫలితంగా ఆయనను రెండు రోజులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించింది సీఐడీ. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఇది కూడా చదవండి: AP high court:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ

ఈ విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కోసం దేశంలోని దిగ్గజ లాయర్లను రంగంలోకి దించారు. మన దేశంలోనే టాప్ లాయర్లుగా పేరొందిన హరీశ్ సాల్వే (Harish Salve), సిద్దార్థ లూథ్రా (Sidharth Luthra), అభిషేక్ సింఘ్వీ (Abhishek Manu Singhvi) చంద్రబాబు క్వాష్‌ పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నిన్న వాదనలు వినిపించడాన్ని చూస్తే టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ కేసును ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. విచారణ సందర్భంగా ధర్మాసనం సైతం.. ఎంత మంది సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపిస్తారంటూ చమత్కరించడం గమనార్హం. ఈ సందర్భంగా హరీశ్‌ సాల్వే స్పందిస్తూ మొత్తం నలుగురం వాదిస్తున్నామని.. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదిస్తున్నట్లు తెలిపారు. ముకుల్ రోహత్గీ సైతం ఓ దశలో.. వాళ్లే ఒకరి తర్వాత మరొకరు వాదనలు వినిపిస్తున్నారని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని వాఖ్యానించారు కూడా. అయితే.. సుప్రీంకోర్టులో ఆ ప్రత్యేక హక్కు ఉంటుందని.. కింది కోర్టుల్లో అయితే ఓ సీనియర్ న్యాయవాదికి మించి అవకాశం ఉండదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. చంద్రబాబు తరఫున వాదించిన లాయర్లకు సంబంధించి ఎంత ఫీజు ఉంటుందనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Big Breaking: హైకోర్టు కీలక ఆదేశాలు.. లోకేష్ సీఐడీ విచారణ ఈ నెల 10కి వాయిదా!

Harish Salve: హరీశ్‌ సాల్వే సుప్రీంకోర్టు అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. నవంబర్1, 1999, నవంబర్ నుంచి. 2002 నవంబర్ 3 వరకు వరకు దేశ సొలిసిటర్ జనరల్‌గా కూడా పనిచేయడం విశేషం. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో కులభూషణ్ జాదవ్ కేసుపై కూడా హరీశ్‌ సాల్వే పోరాటం చేశారు. మన దేశంలో అత్యంత ఎక్కువ ఫీజు కలిగిన లాయర్లలో ఈయన కూడా ఒకరు. ఇతను రోజుకు రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు తీసుకుంటారని ప్రచారం. ఇంతకన్నా కూడా ఎక్కువ తీసుకుంటారన్న ప్రచారం కూడా ఉంది.

Sidharth Luthra: సిద్ధార్థ్ లూథ్రా కూడా దేశంలోని టాప్ లాయర్లలో ఒకరు. జూలై 2012లో సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఆయన నియమించబడ్డారు. మే 2014లో తన ఈ పదవికి రాజీనామా చేశారు సిద్ధార్థ్ లూథ్రా. ఈయన కూడా ఒక్కరోజు వాదనలు వినిపించినందుకు గానూ రూ.10 లక్షలకు పైనే పేమెంట్ తీసుకుంటారని టాక్.

Abhishek Manu Singhvi: అభిషేక్ మను సింఘ్వి కూడా భారతీయ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఇతను రాజకీయ నాయకుడు కూడా. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు కూడా. ఇతను కూడా రోజుకు రూ.10 లక్షల కన్నా కూడా ఎక్కువ ఫీజు తీసుకుంటారన్న ప్రచారం ఉంది.

అయితే.. వీరు కోట్లల్లో ఫీజు తీసుకుంటారన్న ప్రచారం కూడా ఉంది. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఆయన ఏపీకి వచ్చిన సమయంలో రోజుకు కోటి రూపాయలు ఫీజు తీసుకున్నారని కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు