Rain: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. సూచన తెలిపిన వాతావరణ శాఖ

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన వాతావరణశాఖ ఇచ్చింది. మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

Rain: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు భారీ వర్షాలు.. సూచన తెలిపిన వాతావరణ శాఖ
New Update

Rain in Telugu States: వానలే..వానలు..

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో వచ్చే మూడు రోజులు ఏపీ (AP)లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వానలు పడనున్నాయి. అంతే కాకుండా రెండ్రోజుల పాటు తెలంగాణలో (Telangana) కూడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్లుండి నుంచి తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది.

వాతావరణ శాఖ కీలక సూచనలు

అయితే ఈ సంవత్సరం వానలు సమయానికి పెద్దగా పడలేదు. కానీ.. రెండు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రైతులు పంటకు నీరు అందక సాగు వెనకకు పోతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో కొన్ని రోజుల పాటు తేలికపాటి వానలు పడినా... ఎక్కడా భారీ వర్షాలు మాత్రం పడటం లేదు. ఇప్పుడు వర్షపాతం కనిపించటంతో రైతుల్లో ఆందోళన కొంత దూరం అయింది. ఈ రెండు వారాల్లోనైనా భారీ వర్షాలు కురిస్తే అన్నదాతలకు కొంత ఉపయోగంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వానలకు సంబంధించి ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ (IMD) కీలక సూచనలు చేసింది.

ఉత్తరాధిని వణికిస్తున్న వర్షాలు 

మరో మూడు రోజులు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు ఉత్తరాధిని కూడా వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వానలతో యూపీలో కొండచరియలు విరిగిపడి.. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పంజాబ్‌లో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైంది. మణిపూర్‌లో కుండపోత వానలతో 500 ట్రక్కులు నిలిచిపోయాయి. ఒడిశా, జార్ఖండ్‌, బీహార్, బెంగాల్, సిక్కిం, అసోం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌కు కూడా భారీ వర్ష సూచనలు తెలిపారు అధికారులు.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నిన్న వాయువ బంగాళాఖాతం & పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడన ఏర్పడింది. దీంతో వాయువ బంగాళాఖాతం & పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్- ఉత్తర ఒరిస్సా తీరాలలో కొనసాగుతుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనము సగటు సముద్ర మట్టం నుండి 7.6 కీ.మీ ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొన్నది దక్షిణ దిశ వైపుకు వాలి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ రాగల 2 నుండి 3 రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర చత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ -వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. ఎల్లుండి కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులపై వల, రూ. 720 కోట్ల వసూలు

#telangana #ap #rain #rains-in-telangana #rains-in-ap #three-more-days #rains-in-ts #rain-in-telugu-states #heavy-rains-for-3days #imd-predicts-rainfall-in-telugu-states
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe