Meal: భోజనం తర్వాత చేయకూడని మూడు ముఖ్యమైన పనులు

లంచ్‌ లేదా డిన్నర్‌ చేసిన వెంటనే చాలా మందికి నిద్రించే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఇక తిన్న వెంటనే అధికంగా నీరు తాగకూడదు. స్నానం కూడా చేయకూడదు. ఎందుకో తెలుసుకునేందుకు ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Meal: భోజనం తర్వాత చేయకూడని మూడు ముఖ్యమైన పనులు

Meal: చాలా మంది తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు. లంచ్‌ లేదా డిన్నర్‌ తర్వాత చాలా మందికి నిద్రించే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయని, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా జీర్ణం కాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు భోజనం తర్వాత కొన్ని పనులు చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు.

publive-image

భోజనం తర్వాత నిద్రిస్తే:

పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం తిన్న వెంటనే పడుకుంటే ఎసిడిటీతో పాటు అనేక రకాల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అంతేకాకుండా బరువు కూడా పెరుగుతారని, సోమరితనం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తిన్న అన్నం కూడా వంటపడ్డదని అంటున్నారు. అందుకే లంచ్‌ లేదా డిన్నర్‌ తర్వాత గంట పాటు వాకింగ్‌ వంటివి చేయాలని సూచిస్తున్నారు.

publive-image

భోజనం తర్వాత స్నానం వద్దు:

చాలా మంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందని వైద్యులు అంటున్నారు. భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల కడుపులో రక్త ప్రసరణను అడ్డుకుంటుందని, అలాగే జీర్ణక్రియకు ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నారు. ఇలా స్నానం చేయడం వల్ల కడుపులో కాకుండా శరీరంలోని ఇతర భాగాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు.

publive-image

భోజనం తర్వాత నీళ్లు తాగొద్దు:

ఆహారం తీసుకున్న వెంటనే నీరు లేదా మరే ఇతర ద్రవాలను తాగకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పొట్టలోని ఆమ్లాలను పలుచగా చేస్తుందని, అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. అందుకే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత వరకు నీరు తాగకుండా ఉండాలని చెబుతున్నారు. నీరు తాగడం వల్ల తిన్న ఆహారం కడుపులోనే కుళ్లిపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పెదాలపై లిప్‌స్టిక్‌ ఎక్కువ సేపు ఉంటే ప్రమాదకరమా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు