PM Modi : స్వాతంత్య్రం వచ్చాక వాళ్లు దేశ సంస్కృతినే అవమానపరిచారు: ప్రధాని మోదీ

ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశంలో పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు.

PM Modi : స్వాతంత్య్రం వచ్చాక వాళ్లు దేశ సంస్కృతినే అవమానపరిచారు: ప్రధాని మోదీ
New Update

Independence : ప్రధాని మోదీ(PM Modi) ఆదివారం అస్సాంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌(India) కు స్వాతంత్య్రం(Independence) వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇండియాలో ఉన్న పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు. ఇవి భారత్‌తో సహా దక్షిణ ఆసియతో ఈశాన్య ప్రాంతానికి ఉన్న అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.

Also Read: రూ.25లక్షలు.. ఆపై ప్రతీ నెలకు రూ.25వేల పెన్షన్‌.. పద్మ అవార్డు విన్నర్‌లకు గుడ్‌న్యూస్‌!

పవిత్ర స్థలాలు విస్మరించారు

గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో పర్యాటకులు(Tourists) ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు చెప్పారు. 'దేశానికి స్వాతంత్య్రం అనంతరం అధికారంలో ఉన్నవాళ్లు మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను పట్టించుకోలేదు. వాటిని అనుసరించడం ఒక అవమానకరం అనే భావనను కల్పించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పవిత్ర స్థలాలను విస్మరించారు.

నాగరికతకు చిహ్నాలు అవే

కేవలం రాజకీయ లబ్ది కోసం మన గతాన్ని మరుగున పడేలా చేశారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా అభివృద్ధి సాధించలేదు. మన దేశంలో ఉన్న ఆ స్థలాలు కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు. వేల ఏళ్లనాటి భారత నాగరికతకు చెందిన చిహ్నాలు. దేశంలో సంక్షోభాలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని భారత్ స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత పది సంవత్సరాల్లో దేశంలో ఎంతో మార్పు వచ్చిందని' ప్రధాని మోదీ అన్నారు.

Also Read: రష్యాలో భారత దౌత్య కార్యాలయంలో పాకిస్థాన్ గూఢచారి..

#telugu-news #pm-modi #national-news #independence
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe