PM Modi : స్వాతంత్య్రం వచ్చాక వాళ్లు దేశ సంస్కృతినే అవమానపరిచారు: ప్రధాని మోదీ
ఆదివారం అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. భారత్కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దేశంలో పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని అన్నారు.