Movies: ఈ వారం థియేటర్స్ లో అలరించే సినిమాలివే .. అందులో పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ మూవీ కూడా..! ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలు ఇవే. రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్ సలామ్, ట్రూ లవర్ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రిలీజ్ డేట్ వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 06 Feb 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి This Week Theatre Releasing Movies: గత నెలలో సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. గుంటూరు కారం (Guntur Kaaram), సైంధవ్, నా సామి రంగ, హనుమాన్ (Hanuman) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రాలు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈగల్ కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) నటించిన మూవీ ఈగల్ (Eagle). సంక్రాంతి బరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్స్ రద్దీ కారణంగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ త్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు. లాల్ సలామ్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ (Lal Salaam). ఈ చిత్రానికి ఆయన కుమార్తె ఐశ్వర్య డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. లైకా నిర్మాణ సంస్థ నిర్మించింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. క్రికెట్ చుట్టూ తిరిగే ఓ యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. లాల్ సలామ్ ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్! ట్రూ లవర్ ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న థియేటర్స్ లో సందడి చేయనుంది. తమిళ నటుడు ముకుందన్, శ్రీ గౌరీ హీరో, హీరోయిన్స్ గా నటించారు. బేబీ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రభురామ్ వ్యాస్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ఆసక్తిగా కనిపించింది. మరి ఈ చిత్రం థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. కెమెరామెన్ గంగతో రాంబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ కెమెరామెన్ గంగతో రాంబాబు (Cameraman Gangatho Rambabu) రీ రిలీజ్ కు సిద్ధమైంది. 2012 లో రిలీజైన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్స్ లో విడుదల కానుంది. Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..! #lal-salaam #this-week-theatre-releases #ravi-teja-eagle-movie #pawan-kalyan #rajinikanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి