/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-06T152534.415-jpg.webp)
This Week Theatre Releasing Movies: గత నెలలో సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. గుంటూరు కారం (Guntur Kaaram), సైంధవ్, నా సామి రంగ, హనుమాన్ (Hanuman) చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రాలు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈగల్
కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) నటించిన మూవీ ఈగల్ (Eagle). సంక్రాంతి బరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం థియేటర్స్ రద్దీ కారణంగా వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ త్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా నటించారు.
లాల్ సలామ్
రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ (Lal Salaam). ఈ చిత్రానికి ఆయన కుమార్తె ఐశ్వర్య డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. లైకా నిర్మాణ సంస్థ నిర్మించింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. క్రికెట్ చుట్టూ తిరిగే ఓ యాక్షన్ సినిమా ఇది. ఈ సినిమాలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. లాల్ సలామ్ ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Sitara Dance Video: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-06T152940.350-jpg.webp)
ట్రూ లవర్
ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న థియేటర్స్ లో సందడి చేయనుంది. తమిళ నటుడు ముకుందన్, శ్రీ గౌరీ హీరో, హీరోయిన్స్ గా నటించారు. బేబీ నిర్మాత ఎస్‍కేఎన్, డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రభురామ్ వ్యాస్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ ఆసక్తిగా కనిపించింది. మరి ఈ చిత్రం థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
కెమెరామెన్ గంగతో రాంబాబు/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Cameraman-Gangatho-Rambabu-jpg.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ కెమెరామెన్ గంగతో రాంబాబు (Cameraman Gangatho Rambabu) రీ రిలీజ్ కు సిద్ధమైంది. 2012 లో రిలీజైన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఇప్పుడు మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్స్ లో విడుదల కానుంది.
Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..!
Follow Us