OTT Release: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. 'ఓపెన్ హైమర్' మూవీతో పాటు అదిరిపోయే సినిమాలు

ఈ వారం ఓటీటీలో అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయి. ఏడు క్యాటగిరీల్లో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న 'ఓపెన్ హైమర్', జయరామ్ 'అబ్రహం ఓజలర్', సారా ఆలీఖాన్ 'ఆ వతన్ మేరే వతన్' సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి లిస్ట్ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
OTT Release: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. 'ఓపెన్ హైమర్' మూవీతో పాటు అదిరిపోయే సినిమాలు

OTT Release: ప్రతీ వారం ఓటీటీల్లో బోలెడు కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సీరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Also Read: Guntur Kaaram Movie: టీవీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఆ స్పెషల్ డే రోజే టెలికాస్ట్..!

'అబ్రహం ఓజలర్'

మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో మలయాళ సీనియర్ హీరో జయరామ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అబ్రహం ఓజలర్'. క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్ స్టార్ లో మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఓపెన్ హైమర్

ఉత్తమ నటుడు, దర్శకుడు, సినిమా, సహాయ నటుడు ఇలా ఏడుకు పైగా క్యాటగిరీల్లో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకొని సంచలనం సృష్టించిన సినిమా 'ఓపెన్ హైమర్'. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జియో సినిమా వేదికగా మార్చ్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఆ వతన్ మేరే వతన్

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆ వతన్ మేరే వతన్'. దేశభక్తి నేపథ్యం రూపొందిన ఈ సినిమా మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. హిందీలో విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

తులసీవనం

నటుడు , దర్శకుడు తరుణ్ భాస్కర్ నిర్మాణంలో అనిల్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'తులసీవనం'. న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ వెబ్ సీరీస్ మార్చ్ 21న ఓటీటీ వేదిక ఈటీవీ విన్ లో విడుదల కానుంది.

publive-image

ఓటీటీలో రానున్న మరిన్ని చిత్రాలు

డిస్నీ హాట్ స్టార్

మార్చి 20: సాండ్ ల్యాండ్ ( ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

మార్చి 20: ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

మార్చి 22: డేవీ అండ్ జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

మార్చి 22: లూటేరే (హిందీ వెబ్ సిరీస్)

మార్చి 24: ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

Also Read:  Allu Arjun: మరో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..!

Advertisment
తాజా కథనాలు