Guntur Kaaram Movie: టీవీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఆ స్పెషల్ డే రోజే టెలికాస్ట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రం టీవీలోకి వచ్చేస్తుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

New Update
Guntur Kaaram Movie: టీవీలోకి  వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఆ స్పెషల్ డే రోజే టెలికాస్ట్..!

Guntur Kaaram Movie: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. పేరుకు తగ్గట్టుగానే మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ అందించింది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో మహేష్ బాబు లుక్, క్యారెక్టరైజషన్, డైలాగ్స్, డాన్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాయి. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

Also Read: Amitabh Bachchan : అదంతా ఫేక్ న్యూస్.. అనారోగ్యం పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్‌ బచ్చన్‌

టీవీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఓటీటీలో రికార్డు వ్యూస్ తో దుమ్ములేపిన గుంటూరు కారం.. ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 9న ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్రసారం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేసింది జెమినీ ఛానెల్. థియేటర్, ఓటీటీలో అదరగొట్టిన గుంటూరు కారం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు, మురళి కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.

publive-image

Also Read: Pallavi Prashanth: “ప్రాణం పోయినా మాట తప్పను”.. పల్లవి ప్రశాంత్ చేసిన పనికి షాకైన నెటిజన్లు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు