Elon Musk: ఎలాన్ మస్క్‌ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?

ఎలాన్‌ మస్క్‌కు సంబంధించి ఫిబ్రవరి 15న ఓ నివేదిక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆయన సెకన్‌కు 114.80 డాలర్లు(రూ.9,528) , నిమిషానికి 6,887( రూ.5,71,704) డాలర్లు, గంటకు 413,220 డాలర్లు (రూ.34,297,260) సంపాదిస్తున్నట్లు పేర్కొంది.

Elon Musk: మస్క్ మామకు టెస్లా దెబ్బ మామూలుగా లేదు..రెండు నెలల్లో ఎన్ని లక్షల కోట్లు  కోల్పోయాడంటే.!
New Update

Elon Musk: ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తి ఎవరంటే అందిరికి గుర్తొచ్చేది టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్. కానీ ఇటీవల ఆయన రెండో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌, టెస్లా, స్పెస్‌ ఎక్స్‌ లాంటి బడా సంస్థలను నిర్వహిస్తున్న మస్క్‌.. సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. తన కంపెనీలకు సంబంధించిన ఐడియాలను నెటీజన్లతో పంచుకుంటూ.. వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఆయన చేసే ట్వీట్లతో కంపెనీల షేర్లు కూడా తలకిందులు అవుతుంటాయి.

Also Read: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు… మరో బాంబు పేల్చిన మల్లారెడ్డి

నిమిషానికి ఎంతంటే

అయితే ఫిబ్రవరి 15న ఓ నివేదిక ఎలాన్‌ మస్క్‌కు సంబంధించి కీలక విషయాన్ని బయటపెట్టింది. ఆయన నిమిషానికి 6,887 డాలర్లు (దాదాపు రూ.5 లక్షల 71 వేలు) సంపాదిస్తున్నారని పేర్కొంది. ఫోర్బ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాన్ మస్క్‌ సంపద ప్రస్తుతం 198.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవలే ఆయన సంపద 229 బిలియన్ డాలర్ల సంపద నుంచి 198.9 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అయితే 2023లో మస్క్‌.. 3.62023 బిలియన్ డాలర్లు సంపాదించారు.

సంపద తగ్గినా సంపన్నుల్లో ఒకరిగా

2023లో మస్క్‌ సంపాదన రూ.3,00,55,42,28,745.00 (3.6203 బిలియన్‌ డాలర్లు). ఆ ఏడాది నిమిషానికి ఆయన రూ.5,71,668 సంపాదించారు. గత ఏడాది కన్నా ఆయన నికర సంపద విలువ తగ్గిపోయినప్పటికీ ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతున్నారని నివేదిక తెలిపింది. ఏడాదికి 31,536,000 సెకండ్లు ఉంటాయి. కాబట్టి ఎలాన్‌ మస్క్ సంపాదనను సెకండ్లతో లెక్కిస్తే.. సెకన్‌కు 114.80 డాలర్లు(రూ.9,528) , నిమిషానికి 6,887( రూ.5,71,704) డాలర్లు, గంటకు 413,220 (రూ.34,297,260), రోజుకు 9,917,280 డాలర్లు (రూ.823,134,240) , వారానికి 69,420,960 డాలర్లు (రూ.5,761,939,680) సంపాదించారు.

బడా కంపెనీల్లో షేర్లు 

గత ఏడాది ఎలాన్‌ మస్క్‌ సంపద కొంతవరకు ఆవిరైనప్పటికీ ఆయన ప్రపంచ సంపన్నుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈయనకు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన ఎక్స్‌(ట్విట్టర్‌), టెస్లా, స్పెస్‌ ఎక్స్‌, బోరింగ్ కంపెనీ, ఎక్స్‌ఏఐ, న్యూరాలింక్‌ వంటి కంపెనీల్లో అత్యధిక షేర్లు ఉండటం వల్ల వీటి నుంచి ఈయన సంపాదన పెరుగుతూనే ఉంది. ఇక 1971లో దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలో ఎలోన్ మస్క్ జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టిన ఎలాన్‌ మస్క్‌కు చిన్నప్పటినుంచే కంప్యూటర్లు, డిజైన్‌పై మక్కువ ఉండేది.

Also Read: రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా

ఈ క్రమంలోనే ఆయన 17వ ఏట కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీలో చేరాడు. ఆ తర్వాత వ్యాపారం, భౌతిక శాస్త్రాన్ని అభ్యసించేందుకు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ తన సోదరుడు కింబాల్‌తో కలిసి "జిప్ 2" అనే ఆన్‌ లైన్ వ్యాపార డైరెక్టరీని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 1999లో వీళ్లిద్దరూ "జిప్ 2"ని కాంపాక్‌ కి 307 మిలియన్ డాలర్లకు అమ్మేశారు. ఈ విక్రయంలో ఎలాన్ మస్క్ 22 మిలియన్ డాలర్ల వరకు సంపాదించాడు. ఆ తర్వాత కొత్త ఆవిష్కరనలపై ఫోకస్‌ పెడుతూ దూసుకెళ్లిన మస్క్‌ ప్రపంచ ధనవంతుల్లో మొదటి స్థానాన్ని సంపాదించాడు. అయితే ఇటీవలే రెండో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం మొదటి స్థానంలో ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ కొనసాగుతున్నారు.

#telugu-news #elon-musk #tesla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe