Bhatti Vikramarka: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

TG: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని చెప్పారు.

పర్యాటక, సాంస్కృతిక అధికారులతో భట్టి మీటింగ్-LIVE
New Update

Bhatti Vikramarka: ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించారు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆయన మాట్లాడుతూ.. జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒక దఫా రైతు రుణమాఫీ చేసినట్లు చెప్పారు.

ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని అన్నారు. రెండు దఫాలు కలిపి 12 వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్లు లెక్కలు చెప్పారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని అన్నారు. ఆగస్టు లోపే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్నాం అని భట్టి విక్రమార్క అన్నారు.

Also Read: బయటపడ్డ అక్రమాస్తులు.. రూ.6.07 కోట్లు స్వాధీనం

#telangana-news #bhatti-vikramarka #rythu-runa-mafi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe