Students Suicide : భువనగిరి(Bhuvanagiri) బాలికల ఆత్మహత్య(Students Suicide) కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. పంచనామా తర్వాత డెడ్ బాడీస్‌ను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అందులో భవ్య(Bhavya) అనే అమ్మాయి ఒంటి మీద కొరికిన గాయాలు కనిపించాయి. దీంతో ఆమె తండ్రి తన కూతురి మరణం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి డ్రామాలాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. భవ్య ఒంటిపై గాయాల ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు కుటుంబసభ్యులు. బాలికలను ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ కలిపి హత్య చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లే చంపి బలవన్మరణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు
నిన్న భువనగిరిలో చదువుతున్న ఇద్దరు బాలికల ఆత్మహత్య సంచలనానికి దారి తీసింది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందులో ఒకమ్మాయి ఒంటి మీద కొరికిన గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: