Telangana : భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

నిన్న భువనగిరిలో చదువుతున్న ఇద్దరు బాలికల ఆత్మహత్య సంచలనానికి దారి తీసింది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందులో ఒకమ్మాయి ఒంటి మీద కొరికిన గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Telangana : భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో  వెలుగులోకి సంచలన నిజాలు
New Update

Students Suicide : భువనగిరి(Bhuvanagiri) బాలికల ఆత్మహత్య(Students Suicide) కొత్త అనుమానాలకు తెర తీస్తోంది. పంచనామా తర్వాత డెడ్ బాడీస్‌ను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అందులో భవ్య(Bhavya) అనే అమ్మాయి ఒంటి మీద కొరికిన గాయాలు కనిపించాయి. దీంతో ఆమె తండ్రి తన కూతురి మరణం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి డ్రామాలాడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. భవ్య ఒంటిపై గాయాల ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు కుటుంబసభ్యులు. బాలికలను ప్రిన్సిపల్‌, హాస్టల్‌ వార్డెన్‌ కలిపి హత్య చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లే చంపి బలవన్మరణంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Also Read : Andhra Pradesh:మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

పోస్ట్ మార్టం ఆధారంగా కేసు..
భవ్య తండ్రి చేసిన ఫిర్యాదు మీద పోలీసులు దృష్టి పెట్టారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవ్య తండ్రి కృష్ణ, వైష్ణవి తండ్రి నాగరాజు పిర్యాదు మేరకు..హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, పీఈటి ప్రతిభ, ట్యుషనర్ భువనేశ్వరి, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసులు నమోదు చేశామని భువనగిరి డీసీపీ చెప్పారు.

హబ్సిగూడకు చెందిన వారే..
ఈ మేరకు హైదరాబాద్‌(Hyderabad) లోని హబ్సిగూడకు చెందిన బాలికలు (15) భువనగిరిలోని ఎస్సీ వసతిగృహంలో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. అయితే రోజూలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి వచ్చారు. కానీ సాయంత్రం ట్యూషన్‌కు హాజరుకాలేదు. దీంతో ట్యూషన్‌ టీచర్‌ పిలవగా.. తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని గది వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే ఇద్దరు విద్యార్థినులు రెండు ఫ్యాన్లకు ఉరేసుకున్నట్లు టీచర్లకు సమాచారం అందించింది. వెంటనే అంబులెన్స్‌(Ambulance) ను రప్పించి వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

మేడం తప్ప ఎవరూ నమ్మలేదు..
ఇక ఆ బాలికల దగ్గర లభించిన సూసైడ్‌ నోట్‌(Suicide Note) ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. ‘మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి అని రాసి ఉంది.

విద్యార్థినుల మధ్య గొడవ..
ఈ దారుణంపై హాస్టల్‌ వార్డెన్‌ శైలజను, ట్యూషన్‌ టీచర్‌ను.. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌, ఎస్సై నాగరాజు, డీఈవో నారాయణరెడ్డి విచారిస్తున్నారు. వసతిగృహంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకుని ఉంటారని డీఈవో తెలిపారు. ఈ బాలికలు తమను దూషించి.. చేయి చేసుకున్నారంటూ నలుగురు విద్యార్థినులు పాఠశాలలోని ఉపాధ్యాయురాలికి చెప్పడంతో ఆ ఇద్దరికీ శనివారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించి ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

Also Read : కొలిక్కి వస్తున్న విశాఖ ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు

#murder #telangana #bhuvanagiri #students-suicides
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe