Health Tips: ఫ్రిజ్‌లో ఆ పండ్లను అస్సలు పెట్టకండి

కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్‌లు వాడుతుంటారు. అయితే అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, మామిడి, రేగు, చెర్రీస్,లీచీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి త్వరగా పాడై విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

New Update
Health Tips: ఫ్రిజ్‌లో ఆ పండ్లను అస్సలు పెట్టకండి

Don't Keep These Fruits in Fridge: ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లోకి రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయి. కూరగాయలు, పాల ఉత్పత్తులు, పండ్లు, మాంసం ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడానికి ఫ్రిజ్ ఒక ముఖ్యమైన గృహ ఉపకరణంగా మారిపోయింది. అయితే కొన్ని రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని పెడితే అవి త్వరగా పాడవ్వడమే కాకుండా విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: కొవ్వు తగ్గాలంటే ఒక్క నెల ఇలా చేయండి చాలు..

అరటిపండ్లను (Banana) ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లగా మారిపోతుంది. ఈ పండ్ల నుంచి ఇథిలిన్ అనే వాయువు బయటికి వస్తుంది. దీనివల్ల ఫ్రిజ్‌లో ఉన్న ఇతర పండ్లు కూడా త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. అందుకే అరటిపండ్లను ఎప్పుడూ కూడా ఫ్రిజ్‌లో, ఇతర పండ్లతో కలిపి ఉంచకూడదు. ఇక పుచ్చకాయను వేసవిలో ఎక్కువగా తింటుంటారు. చాలామంది దీన్ని ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. ఇలా చేస్తే ఆ పండులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు పాడైపోతాయి. అయితే తినేముందు కొంత సమయం వరకు ఉంచితే పెద్దగా ఇబ్బందేమి ఉండదు.

యాపిల్‌ను (Apple) ఫ్రిజ్‌లో పెట్టినా కూడా క్రియాశీల ఎంజైమ్‌ల వల్ల అవి త్వరగా పండిపోతాయి. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే కాగితంలో చుట్టి ఉంచాలి. రేగు, చెర్రీస్ వంటి విత్తనాలున్న పండ్లను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మామిడి పండ్లను రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఆ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. అలాగే పోషకాలు కూడా నశిస్తాయి. ఇక లీచీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పైభాగం బాగానే కనబడుతుంది. కానీ లోపలి భాగం తొందరగా పాడైపోతుంది.

Also Read: ఎండాకాలం అని నిమ్మరసం అతిగా తాగుతున్నారా..? బీ కేర్‌ఫుల్!

Advertisment
తాజా కథనాలు