Life style:కోపమెక్కువా...అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే..

తన కోపమె తన శత్రువు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందరినీ దూరం చేస్తుంది. కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడంలో ఆహారం కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Life style:కోపమెక్కువా...అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే..
New Update

ఏదైనా కొంచెం ఉంటేనే బావుంటుంది. మనిషన్నాకా అన్ని ఎమోషన్స్ ఉండాలి. కానీ ఎప్పుడూ కంట్రోల్ లో ఉండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు అందుకే. అందులోని కోపం లాంటి వాటితో మరీ జాగ్రత్తగా ఉండాలి. దీని వలన మనకే కాదు మనతోటివారికి కూడా నష్టం కలుగుతుంది కాబట్టి. కోపాన్ని ఫుడ్ కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అందుకే అంటారు ఫుడ్ ఈజ్ ఏ ఎమోషన్ అని. కోపం ఎక్కువగా ఉన్నవారు కొన్ని పదార్ధాలు రెగ్యులర్ గా తీసుకుంటే వారి హార్మోన్లలో మార్పులు వచ్చి అది కంట్రోల్ అవుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పసుపు..

కోపం ఎక్కువగా ఉన్నవారు వారి డైట్‌లో పసుపు చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పసుపులో కర్కుమిన్‌ ఉంటుంది. దీనికి యాంటీఇన్‌ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కర్కుమిన్‌ మన శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి ఫీల్-గుడ్ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.​

బనానా..

కోపం ఎక్కువగా ఉంటే.. అరటిపండు కచ్చితంగా తినాలి. అరటిపండులో విటమిన్‌ ఏ, బి, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు శరీరాన్ని రిలాక్స్‌ చేస్తాయి. డోపమైన్‌ వంటి హ్యాపీ హార్మోను యాక్టివ్‌ చేస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి.. కోపాన్ని తగ్గిస్తుంది.

బాదం..

కోపాన్ని తగ్గించడానికి బాదం సూపర్‌ ఫుడ్‌లా పనిచేస్తుంది. బాదం పప్పులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని నరాలు, కండరాల కణాలకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఒక్కసారిగా ఆందోళనను తగ్గించి, మనల్ని శాంతపరుస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్..

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్‌ను మెండుగా ఉంటాయి. అవిసె గింజలు కోపాన్ని కంట్రోల్‌ చేసే సూపర్‌ఫుడ్‌‌గా పనిచేస్తుంది. అవిసె గింజలు మానసిక రుగ్మతలను నివారించి, ఆందోళన, నిరాశతో పోరాడటానికి సహాయపడుతుంది. చారు, కూరలు, చట్నీలు, స్మూతీలు, పాన్‌కేక్‌లలో అవిసె గింజలు వేసుకుని తీసుకోవచ్చును.

గుమ్మడి గింజలు..

గుమ్మడి గింజల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఇది మెగ్నీషియం స్టోర్‌ హౌస్‌. గుమ్మడిగింజలు హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది, ఇది శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది, హార్మోన్ల సమతుల్యతను స్థిరీకరిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం అధికంగా ఉండే పొద్దుతిరుగుడు విత్తనాలు అలసటను తగ్గిస్తాయి. ఆందోళన సమస్యలను ఎదుర్కోవటానికి సహాయపడతాయి.

కివీ..

కివీ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్‌ సి శక్తీవంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఏది అవసరమో దాన్ని బట్టి ఇది ప్రో-ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది! ఇది మానసిక ప్రశాంతంతను మెరుగుపరుస్తుంది.

గ్రీన్ లీవ్స్..

ఆకుకూరలు కోపాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. ఆకు కూరలలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. ఇది ఆందోళనను తగ్గించడానికి, కండరాలను రిలాక్స్‌ చేయడానికి తోడ్పుడుతుంది. అందుకే తప్పనిసరిగా సలాడ్స్‌, వంటల్లో ఆకుకూరలను చేర్చుకోవాలి.

#life-style #health #angry #control #super-food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe