Upcoming Smart Phones: డిసెంబర్ లో మార్కెట్లో అదరగొట్టే స్మార్ట్ ఫోన్లు ఇవే...ధర,ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే..!!

ప్రస్తుత డిసెంబర్ నెలలో వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి టాప్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈలిస్టులో మిడ్ రేంజ్ ఫోన్లు కూడా ఉన్నాయి.

Upcoming Smart Phones: డిసెంబర్ లో మార్కెట్లో అదరగొట్టే స్మార్ట్ ఫోన్లు ఇవే...ధర,ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే..!!
New Update

కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లు కాకుండా..తాజా మోడళ్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే...మీకో గుడ్ న్యూస్. ప్రస్తుత డిసెంబర్ నెలలో కొన్ని టెక్ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడదుల చేసేందుకు రెడీ అవుతున్నాయి. వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి రానున్న మోడళ్లపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ జాబితలో బడ్జెట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. డిసెంబర్ లో మార్కెట్లోకి విడుదల కానున్న స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.

వన్ ప్లస్ 12 5జీ :
వన్ ప్లస్ బ్రాండ్ డిసెంబర్ 5న చైనాలో వన్ ప్లస్ 12 ఫోన్ను విడుదల చేయనుంది. గ్లోబల్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో దీని ప్రమోషన్ను వన్ ప్లస్ ప్రారంభించింది. పలు రిపోర్టుల ప్రకారం..ఈ ఫోన్ డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో ఇండియాలో విడుదల కావచ్చు. వన్ ప్లస్ 12 సిరీజ్ ను కంపెనీ జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరిస్తుందని టిప్ స్టర్ మాక్స్ జాంబోర్ తెలిపారు. వన్ ప్లస్ 11 5జీ ధర బేస్ వేరియంట్ ఇండియాలో రూ. 54, 495 వరకు ఉండే ఛాన్స్ ఉంది. కొత్త ఫోన్ ధర కూడా ఇదే రేంజ్ లో ఉండవచ్చు.

రెడ్మీ 13సి 5జీ:
రెడ్మీ 13సి 5జీ ఫోన్ బడ్జెట్ రేంజ్ సరికొత్త ఫీచర్లతో విడుదల కానుంది. దీని ధర రూ. 10వేల రేంజ్ లో ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో విడుదలైన రెడ్మీ 12సికి సక్సెసర్ గా కొత్త మోడల్ ను కంపెనీ రిలీజ్ చేస్తుంది. రెడ్మీ 13సి ఇప్పటికే నైజీరియాలో విడుదలయ్యింది. డిసెంబర్ 6న భారత మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది కంపెనీ సి సిరీస్ లో తీసుకొచ్చిన ఫస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది. రెడ్మీ 13సి 5జీ ఇప్పటికే అమెజాన్ లిస్ట్ అయి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 5మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో స్టార్ డస్ట్ బ్లాక్, స్టార్ షైన్ గ్రీన్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

రెడ్మీ నోట్ 13ప్రో సిరీస్:
ఇండియాలో రెడ్మీ నోట్ 13 ప్రో సిరీస్ ఫోన్లు ఈ డిసెంబర్ లేదా జనవరిలో విడుదల అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో రెడ్మీ నోట్ 13,రెడ్మీ నోట్ 13 ప్రో,రెడ్మీ నెట్ 13 ప్రో ప్లస్ 5జీ మోడళ్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్లు భారత్ లో మిడ్ రేంజ్ సెగ్మెంట్ పై ద్రుష్టి పెట్టాయి. వీటి ధరలు రూ. 30వేల నుంచి ప్రారంభం కావచ్చని కొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

రియల్మీ జిటి5 ప్రో:
రియల్మీ జిటి5 ప్రో ఫోన్ డిసెంబర్ 7న చైనాలో విడదులయ్యింది. అడ్వాన్స్డ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 చిప్ సెట్ తో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. వైర్ లెస్ ఛార్జింగ్ 1టిబి స్టోరేజ్ వంటి ఫీచర్లతో ఫోన్ను రూపొందించారు. భారత్ లో ఈ ఫోన్ విడుదల తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 50వేల నుంచి రూ. 60వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: న్యుమోనియా, వైరల్ ఫీవర్, ఫ్లూ మధ్య తేడా ఏమిటి? ఎలా గుర్తించాలి..?

#tech-news #oneplus #realme #upcoming-smart-phones #redmi #new-smartphone
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి