Petrol and Diesel Prices: దేశవ్యాప్తంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల అయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పరిగణలోనికి తీసుకుని భారత్ లో ఇంధన ధరలను నిర్ణయిస్తారు. కాగా గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో విధించే పన్నుల కారణంగా పలు రాష్ట్రాలు, నగరాల్లో పెట్రోలు , డీజిల్ (Petrol Diesel Prices) ధరల్లో స్వల్పంగా మార్పులను గమనించవచ్చు.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ అయిల్ ధర బ్యారెల్ కు 84.42 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్ కు 82.71గా ఉంది. అయితే ఈరోజు భారత చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 ఉండగా..లీటర్ డీజిల్ ధర రూ. 89.62గా ఉంది. దీంతోపాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ లీటర్ ధర రూ. 106.31గా ఉంటే డీజిల్ ధర లీటర్ కు 94.27వద్ద స్థిరంగా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.63గా ఉంటే...డీజిల్ ధర రూ. 94.24గా వద్ద కొనసాగుతోంది. కాగా మనదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ ఉదయం సవరిస్తారు.
ఇది కూడా చదవండి: పుంగనూరు అంగల్లు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ..!!
ఈ నగరాల్లో కొత్త ధరలు ఈ విధంగా ఉన్నాయి:
- నోయిడాలో పెట్రోల్ రూ. 96.59, డీజిల్ ధర లీటరుకు రూ. 89.76గా ఉంది.
– లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.
– పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.108.98, డీజిల్ ధర రూ.94.51.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74.
ఇక హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
-పెట్రోల్ ధర రూ .109.67 ,
డీజిల్ ధర రూ .97.82 గాఉంది.
ఇది కూడా చదవండి: ఐదంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం..!!