Punganur Angallu Case: చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెళ్లినప్పుడు అక్కడ ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో చాలా మంది గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమంటూ పలు కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు తోపాటు 20 మంది టీడీపీ (TDP) నేతలపై పోలీసులు కేసులు పెట్ారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు అప్పట్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణవాతావరణం నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు, దేవినేనిఉమతోపాటు పలువురు టీడీపీ నేతలను ఏ1,ఏ2 గా పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంతో పుంగనూరు అంగళ్లు కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
పూర్తిగా చదవండి..Punganur: పుంగనూరు అంగల్లు అల్లర్ల కేసుపై నేడు హైకోర్టులో విచారణ..!!
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన అల్లర్లపై నేడు ఏపీ హై కోర్టులో విచారణ జరగనుంది. పుంగనూరు అల్లర్లలో టీడీపీ నేతలు అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ భుమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ దమ్మలపాటి రమేష్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి..తమపై నమోదు అయిన కేసులపై ముందస్తు బెయిల్ కోరుతూ టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.
Translate this News: