Summer Vegetables: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే

వేసవిలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. వేసవిలో తేలికగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారాన్ని తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. వేసవిలో దోసకాయ, వంకాయ, టమాటో, గ్రీన్ బీన్స్, గుమ్మడికాయ వంటివి తింటే మంచిది.

Summer Vegetables: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే
New Update

Summer Vegetables: వేసవిలో వీలైనంత వరకు సింపుల్, న్యూట్రీషియన్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఆహారాలలో తగినంత నీరు, పోషకాలు ఉంటే అవి ఎండ వేడి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. మండే వేసవిలో మనం వేసుకునే బట్టలు, వేసుకునే షూస్‌తో పాటు తినే ఆహారంలో కూడా మార్పు అవసరం. వేసవిలో ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. కాబట్టి వేసవిలో తేలికగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారాన్ని తినడం మంచిది. ఇందులో ఎక్కువగా పండ్లు, కూరగాయలు వేసవిలో శరీరానికి అవసరమైన తేమతో పాటు అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయని నిపుణులు అంటున్నారు.

publive-image

దోసకాయ:

దోసకాయలో దాదాపు 96 శాతం నీరు ఉంటుంది. వేసవిలో పచ్చి దోసకాయ తినడం చాలా మంచిది. ఇందులోని విటమిన్ సి, సిలికా మూలకాలు వేసవిలో చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా కోల్పోయిన కణజాలాలను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఇందులో నీరు, పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం అనేది ఎలక్ట్రోలైట్. ఇది మూత్రపిండాల్లో సోడియం మొత్తాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే కరిగే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

publive-image

వంకాయ:

సాధారణంగా ఊదా రంగు వంకాయలో ఎక్కువగా కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే వంకాయలో పొటాషియం, విటమిన్ K, మెగ్నీషియం, కాపర్, విటమిన్ సి, విటమిన్ B6, ఫోలేట్ అధికంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండాలి.

publive-image

టమాటో:

టమోటో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె రోగులకు చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ కె, లైకోపీన్, పొటాషియం, విటమిన్ బి6, ఫోలేట్, కరిగే ఫైబర్, మాంగనీస్, నియాసిన్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి.

publive-image

గ్రీన్ బీన్స్:

గ్రీన్ బీన్స్‌లో విటమిన్ సి, ఎతో పాటు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే విటమిన్ కె వంటి పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు హానికరమైన కణాల నుండి రక్షిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల ఆకలిని అదుపులో ఉంచుతాయి.

publive-image

గుమ్మడికాయ:

గుమ్మడికాయ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కరగని ఫైబర్ జీర్ణవ్యవస్థ సులభంగా పనిచేయడానికి, అనారోగ్య బ్యాక్టీరియాను బయటికి పంపడానికి సహాయపడుతుంది.
ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చర్మ సమస్యలకు కూడా మంచిది. తక్కువ కేలరీలు, పీచుపదార్థాలు గుమ్మడికాయలో అధికంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: వామ్మో..ఒట్టిచేత్తో పాన్‌ను మడతెట్టేసిన మహిళలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #health-care #best-health-tips #summer-vegetables
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe