Krishna River Management Board : కేఆర్ఎంబీ(KRMB) ఇష్యూపై తెలంగాణ సర్కార్(Telangana Sarkar) కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలతోపాటు ప్రాజెక్ట్‌ల అప్పగింత వివాదానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించబోతున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ విమర్శలు..
ఈ మేరకు సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు అప్పగించాలనే నిర్ణయంపై బీఆర్‌ఎస్(BRS) విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సాగునీటి నిర్వహణ కాంగ్రెస్(Congress) కు చేతకావడం లేదని, కేఆర్ఎంబీ బోర్డుకు అప్పగించాలనే నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. కృష్ణా నదీ జలాల పంపిణీ అంశం ట్రిబ్యునల్ వద్ద తేలకముందే ప్రాజెక్టులను బోర్డుకు ఎందుకు అప్పగిస్తున్నారంటున్న బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలను సీఎం రేవంత్ తిప్పికొట్టనున్నారు. 2014 నుంచి జరిగిన ఒప్పందాలు, లెక్కలు బయటపెట్టబోతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Telangana : ప్రతి గ్రామంలో ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’.. కలెక్టర్లను ఆదేశించిన మంత్రి సీతక్క