Parrot Fever: చిలుకల నుంచి సోకుతున్న జ్వరం.. జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం గల్లంతే! యూరప్‌ను చిలుక జ్వరం కలవరపెడుతోంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా చిలుకల లాంటి పక్షులకు సోకుతుంది. వాటి రెట్టల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. పెంపుడు పక్షులతో పనిచేసే కార్మికులు, వైద్యులు, పక్షుల యజమానులు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. By Vijaya Nimma 14 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Parrot Fever: ఐరోపాను చిలుక జ్వరం కలవరపెడుతోంది. చిలుకల నుంచి మానవులకు వ్యాపించే ఈ జ్వరం కారణంగా ఈ ఏడాదిలో ఐరోపాలో ఐదుగురు మరణించారు. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్‌లో పిట్టకోసిస్ అని పిలిచే చిలుక జ్వరం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పిట్కోసిస్ అనేది క్లామిడోఫిలా సిట్టాసి అనే బాక్టీరియా వల్ల కలిగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. చిలుక జ్వరం ఎలా వ్యాపిస్తుంది? ఈ బ్యాక్టీరియా ప్రధానంగా చిలుకల వంటి పక్షులకు సోకుతుంది. వాటి రెట్టల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. పెంపుడు పక్షులతో పనిచేసే కార్మికులు, వైద్యులు, పక్షుల యజమానులు, వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో తోటలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మనుషులకు ఎలా వస్తుంది? 450 కంటే ఎక్కువ పక్షి జాతులతో పాటు కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పందులు, సరీసృపాలలో క్లామిడోఫిలా పిట్టాసి గుర్తించారు. కానీ బాక్టీరియా ఎక్కువగా చిలుకలు, పావురాలు, పిచ్చుకల ద్వారా మనుషులకు వ్యాపిస్తోంది. పక్షుల ఎండిన మలం, అవి ఊపిరి పీల్చినప్పుడు బయటకు వచ్చే స్రావాలు, ఈకల్లోని దుమ్ము ద్వారా బ్యాక్టీరియా మనుషులకు చేరుతుంది. చిలుక జ్వరం లక్షణాలు: జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, పొడి దగ్గు ఉంటుందని నిపుణులు అంటున్నారు. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన ఐదు నుంచి 14 రోజులలో ఈ లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయని చెబుతున్నారు. యాంటీబయోటిక్స్‌తో ఈ జ్వరాన్ని నయం చేసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోండి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా పక్షి జబ్బుపడినట్లు గుర్తిస్తే పశువైద్యుని దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని అంటున్నారు. పక్షి సంరక్షకులు పరిశుభ్రతను పాటించాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పూర్వజన్మల పాపాలు పోగొట్టే ఆలయ గంటలు! శాస్త్రం ఏం చెబుతోంది? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #symptoms #europe #parrot-fever మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి