Smalllest budget:పార్లమెంటులో ఈరోజు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. మొత్తం 57 నిమిషాలపాటూ ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్‌ను చదివి వినిసించిన ఆర్ధిక మంత్రి ఈ సారే అత్యంత తక్కువ టైమ్ బడ్జెట్‌ను వినిపంచారు. గతంలో ఇంక కంటే ఎక్కువ సమయమే బడ్జెట్‌ను చదివి వినిపించారు నిర్మలా సీతారామన్.
ఆరుసార్లు బడ్జెట్...
పార్లమెంటులో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో ప్రస్తుత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకరు. మోరార్జీ దేశాయ్ తరువాత ఆరు సార్లు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మల రికార్డ్ సాధించారు. 2019లో ఆర్ధి్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈమె పూర్తిస్థాయి ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన తొలి మహిళగా కూడా చరిత్రకెక్కారు. 1970-71లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళగా ఇంధిరాగాంధీ కీర్తి పొందారు. అయితే ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఫైనాన్స్ మినిస్టర్‌గానే ఉన్నారు.
గతంలో 2గంటల కంటే..
ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు మరో రికార్డ్ కూడా ఉంది. ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాదు ఎక్కువ సమయం ప్రసంగాన్ని వినిపించిన మంత్రిగా కూడా ఆమె నిలిచారు. 2020-21 బడ్జెట్‌ను నిర్మలా 162 నిమిషాలు అంటే 2 గంటలా 42 నిమిషాల పాటూ వినిపించారు. అది కూడా ఆ రోజు నిర్మలా ఒంట్లో బాగోలేకపోవడంతో. ఆ రోజు ఆమెకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఇంకో రెండు పేజీలు ఉందనగా ప్రసంగాన్ని ముగించారు. లేకపోతే ఆ టైమ్ ఇంకా ఎక్కువ అయ్యేది. బారత బడ్జెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతి పెద్ద లేదా సుదీర్ఘ ప్రసంగంగా ఉంది.