Budget today:57 నిమిషాల మధ్యంతర బడ్జెట్...ఇప్పటివరకు ఇదే అత్యంత చిన్నది ఈరోజు ఉదయం పార్లమెంటులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 57 నిమిషాలపాటూ ఈ ప్రసంగం సాగింది. అయితే ఇప్పటివరకు నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్లలో ఇదే అతి చిన్నది. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరవసారి. By Manogna alamuru 01 Feb 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Smalllest budget:పార్లమెంటులో ఈరోజు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. మొత్తం 57 నిమిషాలపాటూ ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్‌ను చదివి వినిసించిన ఆర్ధిక మంత్రి ఈ సారే అత్యంత తక్కువ టైమ్ బడ్జెట్‌ను వినిపంచారు. గతంలో ఇంక కంటే ఎక్కువ సమయమే బడ్జెట్‌ను చదివి వినిపించారు నిర్మలా సీతారామన్. VIDEO | "Social justice: Our government is working with an approach to development that is all-round, all pervasive and all inclusive," says Finance Minister Nirmala Sitharaman.#Budget2024WithPTI pic.twitter.com/aJ2qHJoQDd — Press Trust of India (@PTI_News) February 1, 2024 VIDEO | "Making triple talaq illegal, reservation of one -thirds seats for the women in Lok Sabha and state assemblies and giving over 70 percent houses under PM Awas Yojana in rural areas to women as sole or joint owner has enhanced their dignity," says Finance Minister Nirmala… pic.twitter.com/bnSLcTWKgZ — Press Trust of India (@PTI_News) February 1, 2024 ఆరుసార్లు బడ్జెట్... పార్లమెంటులో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో ప్రస్తుత ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకరు. మోరార్జీ దేశాయ్ తరువాత ఆరు సార్లు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మల రికార్డ్ సాధించారు. 2019లో ఆర్ధి్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈమె పూర్తిస్థాయి ఆర్ధిక శాఖ మంత్రిగా పని చేసిన తొలి మహిళగా కూడా చరిత్రకెక్కారు. 1970-71లో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళగా ఇంధిరాగాంధీ కీర్తి పొందారు. అయితే ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఫైనాన్స్ మినిస్టర్‌గానే ఉన్నారు. గతంలో 2గంటల కంటే.. ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు మరో రికార్డ్ కూడా ఉంది. ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాదు ఎక్కువ సమయం ప్రసంగాన్ని వినిపించిన మంత్రిగా కూడా ఆమె నిలిచారు. 2020-21 బడ్జెట్‌ను నిర్మలా 162 నిమిషాలు అంటే 2 గంటలా 42 నిమిషాల పాటూ వినిపించారు. అది కూడా ఆ రోజు నిర్మలా ఒంట్లో బాగోలేకపోవడంతో. ఆ రోజు ఆమెకు ఆరోగ్యం బాలేకపోవడంతో ఇంకో రెండు పేజీలు ఉందనగా ప్రసంగాన్ని ముగించారు. లేకపోతే ఆ టైమ్ ఇంకా ఎక్కువ అయ్యేది. బారత బడ్జెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతి పెద్ద లేదా సుదీర్ఘ ప్రసంగంగా ఉంది. #nirmala-sitaraman #budget #finance-minister #parliamnet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి