/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-94-jpg.webp)
Red Sandalwood Smugglers Murdered Constable: ఏపీలో దారుణం జరిగింది. ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. తమ దందాకు అడ్డు వస్తున్నాడనే కోపంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను అతి కిరాతకంటా హతమార్చారు. కాపు కాసి మరి వేటు వేశారు. ఒళ్లు గగుర్లు పొడిచే ఈ భయంకరమైన సంఘటన అన్నమయ్య జిల్లాలో (Annamayya District ) జరిగింది.
 గొల్లపల్లి చెరువు వద్ద..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. దీంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద దుంగలను పట్టుకునేందుకు పోలీసులు కాపు కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు ప్రయత్నించాడు.
ఇది కూడా చదవండి :Central Govt : స్టూడెంట్స్‌కి బిగ్ షాక్.. కాపీ కొడితే 10 ఏళ్ల జైలు, కోటి జరిమానా!
వాహనంతో ఢీ కొట్టి..
అయితే అది గమనించిన స్మగ్లర్లు వాహనంతోపాటు తప్పించుకునే ప్రయత్నంలో గణేశ్ (Constable Ganesh) ను వారి వాహనంతో ఢీకొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో కన్నుమూసినట్లు తెలిపారు. ఇక నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 Follow Us
 Follow Us