Telangana: సర్వం సిద్ధం.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

తెలంగాణలో నామినేషన్ల పర్వానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఇప్పటికే అధికార, విపక్ష, స్వతంత్ర అభ్యర్థలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమైపోయారు.

Telangana: సర్వం సిద్ధం.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
New Update

ఈ నెల చినర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రచారాల్లో మునిగిపోయాయి. అయితే శుక్రవారం ఓ కీలక అంశం తెరపైకి వచ్చింది. ఇకనుంచి నామినేషన్లకు రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టనున్నాయి. ఈరోజు నుంచి 10వ తేదీ వరకు ఈ నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల్లో టికెట్ కన్ఫామ్ అయిన అభ్యర్థులతో పాటు కొంతమంది ఆశావాహులు అలాగే స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముహుర్తాల మీద నమ్మకం ఉన్నవారు సమయానికి తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. శుక్రవారంతో పాటు ఈనెల 4,7,8,9,10వ తేదీల్లో భారీగా నామినేషన్లు దాఖల్యయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పటికే అధికారులు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రకియలో అధికారులు, అలాగే బరిలో నిలవనున్న అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అలాగే నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పాటించాల్సిన పద్దతులు, జాగ్రత్తలను వివరించేందుకు కార్యాలయంలో సిబ్బంది రెడీగా ఉన్నారు. ఇక జనరల్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ స్థానాలు లేదా జనరల్ స్థానాల నుంచి బరిలోకి దిగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులు నోటరీ ద్వారా తమ ఆస్తులు, ఆదాయ వ్యయాలు, తమపై ఉన్న కేసుల వివరాల గురించి నామినేషన్ పత్రాల్లో చూపించాల్సి ఉంటుంది.

అంతేకాదు నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థుల పేరు ప్రస్తుతం ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఓటర్ల జాబితాలో కూడా కచ్చితంగా నమోదై ఉండాలి. అలాగే అభ్యర్థుల ప్రతిపాదకులు కూడా స్థానిక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండాలి. ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖాలు చేయడానికి కమిషన్‌ అవకాశం కల్పించింది. శుక్రవారం నుంచి ఈ నెల 10న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఇక వచ్చిన నామినేషన్లను 13వ తేదీన పరిశీలన చేస్తారు. ఆ తర్వాత పోటీలో ఉండేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. అదే రోజు నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంది. ఆ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. నామినేషన్లు స్వీకరించే ఆర్‌వో కార్యాలయం వద్ద ఇప్పటికే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కార్యాలయానికి 100 మీటర్ల వరకు నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతించనున్నారు.

Also Read: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసింది వాళ్లే…సీతక్క సంచలన వ్యాఖ్యలు..!!

#telangana-elections #telugu-news #nominations #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe