హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం

శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ చేరుకోగానే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. డిసెంబర్ 23న ద్రౌపది ఢిల్లీకి వెళ్లనున్నారు.

హైద‌రాబాద్ చేరుకున్న రాష్ట్రపతి.. స్వాగతం పలికిన గవర్నర్‌, సీఎం
New Update

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ చేరుకోగానే తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఇక శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకూ ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు.

ఇది కూడా చదవండి :  పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

రాష్ట్రపతికి రాకతో అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ వచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా తదితర ఉన్నతాధికారులు విమానశ్రయానికి వచ్చి ద్రౌపదిని స్వాగతించారు. ఈ ఐదు రోజులపాటు ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన‌నున్న రాష్ట్రప‌తి .. తిరిగి డిసెంబర్ 23న ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.

#hyderabad #draupadi-murmu #revanth-reddy #begumpet
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe