/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
Food Late : వంట చేయడం ఆలస్యమైందని భార్య(Wife) ను హత్య చేశాడో భర్త. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం బాలాఘాట్‌కు చెందిన రవీనాదుర్వే (26), నవీన్‌దుర్వే దంపతులు. భార్యాభర్తలు హైదరాబాద్(Hyderabad) కు జీవనోపాధి కోసం వలస వచ్చారు.
ప్రగతినగర్ ప్రగతి కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో కూలీలుగా పనిచేస్తూ అక్కడే గుడిసెల్లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటలకు నవీన్‌దుర్వే ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. భార్య భోజనం వడ్డించగా, వంటరుచిగా లేదంటూ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో క్షణికావేశంలో నవీన్‌దుర్వే అక్కడే ఉన్న ఇటుకరాయితో భార్య తలపై బలంగా కొట్టాడు(Murder). దీంతో తలపగిలి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Also read: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు