Telangana: అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు.. 40 బస్సులు, 3 వేల మంది!

తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించేందుకు సిద్ధమైంది. ఉదయం సభలో పాల్గొన్న అనంతరం నేరుగా 40 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరనున్నారు. 3వేల మంది కూర్చునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.

Telangana: అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు.. 40 బస్సులు, 3 వేల మంది!
New Update

Medigadda: తెలంగాణలోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (vikramarka)తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరీశీలించడానికి వెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మొదలవగానే 10.15 వరకు సభలో పాల్గొన్న అనంతరం నేరుగా బస్సుల్లో మేడిగడ్డకు బయలుదరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుని రెండు గంటలపాటు సైట్‌ విజిట్‌, పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఉంటుందని అధికారులు వెల్లడించారు.

40 బస్సుల్లో 3వేల మంది..
ఇక ఈ కార్యక్రమం పూర్తి కాగానే సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు ఈ బృందం తిరిగిరానుంది. ఇక అక్కడ నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ప్రభుత్వ ఖర్చుతో తీసుకెళ్తామని శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం 40 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బ్యారేజీ డ్యామేజ్ అయిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద 3 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే నిర్మాణ లోపాలపై పీపీటీ, సభ నిర్వహించే అవకాశం ఉంది. భద్రతపరంగా ఆయా మార్గాల్లో పోలీసు అధికారులు ప్రయాణించి పరిశీలించారు. రహదారులు, కల్వర్టులను బాంబు స్క్వాడ్ తనిఖీ నిర్వహించారు.

ఇది కూడా చదవండి: Telangana: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కేసు విచారణ వాయిదా!

బీఆర్ఎస్ కు ఎఫెక్ట్..
బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు బ్యారేజీ మధ్యలోని పిల్లర్లకు బీటలు వారగా బ్యారేజీ కుంగింది. ఆ తర్వాత గేట్ల వద్ద బీటలు కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బగా మారింది. దీనినే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకుంది.

#tuesday #congress-team #madigadda #visit #revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి