ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీపీ కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. 28 పేజీలతో చంద్రబాబు రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించారు. అసలు స్కిల్ స్కామ్ ఎలా జరిగిందన్న విధానాన్ని సీఐడీ క్లియర్ గా వివరించింది. చంద్రబాబే కుట్రకు సూత్రధారి అంటూ సీఐడీ పేర్కొంది. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు తనయుడు లోకేష్ పేరునుకూడా ప్రస్తావించారు. కిలారి రాజేశ్ ద్వారా లోకేశ్ కు డబ్బులు ముట్టాయని సీఐడీ తెలిపింది. సీఐడీ డీఎస్సీ ధనుంజయుడు పేరుపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు సంబంధించి కేసులో ఏసీపీ కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఇప్పటికే సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ రిమాండ్ రిపోర్టులో చంద్రబాబును ప్రధాన నిందితుడి ఏ1గా చేర్చింది సీఐడీ. ఈ క్రమంలో ఆయన్ను విచారించేందుకు 15రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వాలని న్యాయమూర్తినిని సీఐడీ కోరింది.
సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద విజయవాడ కోర్టులో ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ నిధులను సొంతానికి వాడుకోవడం అనే అంశాలపై చంద్రబాబు పై నేరాభియోగం మోపినట్లు తెలుస్తోంది. ఉద్దేశవూర్వకంగా మోసం చేయడం, ఫోర్జరీ చేసి మోసం చేయడం, డాక్యుమెంట్లను కూడా ఫోర్జరీ చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడం, వంటి అభియోగాలు ఉన్నట్లు సీఐడీ ఆరోపిస్తోంది.