Thalapathy Vijay : పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ అభినందనలు.. వైరల్ అవుతున్న ట్వీట్!

ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ గెలుపుపై తమిళ స్టార్ హీరో విజయ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Pawan Kalyan: తనకు ఏ పదవి కావాలో చెప్పేసిన పవన్ కల్యాణ్..!
New Update

Kollywood Actor Vijay Congratulates Pawan Kalyan : ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వ‌త్రిక‌ ఎన్నికల (General Elections) ఫలితాల్లో టీడీపీ (TDP) కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతపై 70 వేలకుపైగా మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు.

దీంతో జనసేనాని గెలుపుపై సినీ పరిశ్రమలోని నటీనటులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు పవన్ ఇంటికి చేరుకోగా.. సినీ సెలబ్రెటీలు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా పవన్ గెలుపుపై తమిళ స్టార్ హీరో విజయ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

Also Read : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘కల్కి’ ట్రైలర్ వచ్చేస్తోంది..!

కంగ్రాట్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు..

ఈ మేరకు విజయ్ తన పర్సనల్ ట్విట్టర్ లో.." భారీ విజయం సాధించి, జనసేన పార్టీని ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. ప్రజలకు సేవ చేసేందుకు మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం అంటూ పోస్ట్ చేసాడు. అలాగే చంద్రబాబుని కూడా అభినందిస్తూ.. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ లీడర్ షిప్ లో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను" అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ ట్వీట్స్ ని పవన్ ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

#pawan-kalyan #general-elections-2024 #thalapathy-vijay #kollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe