TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ! చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 31 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TG RTC: చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. హైదరాబాద్, వరంగల్ నగరాలలో ఆర్టీసీ సంస్థ ఐటిఐ కాలేజీలను నిర్వహిస్తున్న విషయం గురించి అందరికీ తెలిసిందే. ఈ కాలేజీలలో యువతకు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి అవకాశాలను చూపెడుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెకానిక్ డీజిల్, వెల్డర్, మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్ లాంటి వివిధ ట్రేడులలో ప్రవేశం కల్పించబోతున్నారట. ఇక ఈ కాలేజీలో ప్రవేశం కోసం జూన్ 10 చివరి తేదీ. ఆ సమయం లోపు దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ఆర్టీసీ ఐటిఐ కాలేజ్‌లలో శిక్షణ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ట్రేడ్స్ లో చేరేందుకు అర్హత ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తోంది. ఇక శిక్షణ కొరకు వెబ్ సైట్ ను ఉపయోగించి అప్లికేషన్ పెట్టాలి. ఈ కోర్సులలో మోటార్ మెకానిక్ రెండు సంవత్సరాల వ్యవధి, మెకానిక్ డీజిల్ ఏడాది శిక్షణను కలిగి ఉంటుంది. ఈ రెండు ట్రేడ్స్ చదవాలన్నవారు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి. అలాగే పెయింటింగ్ శిక్షణకు రెండు సంవత్సరాలు, వెల్డింగ్ అయితే ఏడాదికాలం శిక్షణను కలిగి ఉంటుంది. వీటికి కేవలం ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు. ఇందులో కేవలం కొన్ని పరిమిత సీట్లు మాత్రమే ఉంటాయి. Also read: ఢిల్లీ విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు! #entrance #rtc #education #telangana #sajjanar #jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి