Bomb Threat: ఢిల్లీ విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు! దేశంలోని విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.దీంతో వెంటనే..ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. By Bhavana 31 May 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Delhi: దేశంలోని విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. శుక్రవారం నాడు 178 మంది ప్రయాణికులతో శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే.. విమానయాన సంస్థ, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానానికి బెదిరింపులు వచ్చిన క్రమంలో ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించి.. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఐసోలేషన్ బే కి మళ్లించారు. “ప్రయాణికులందరినీ ఐసోలేషన్ బేలో సురక్షితంగా డి-బోర్డింగ్ చేశారు. ప్రస్తుతం సంబంధిత అధికారులందరు భద్రతను నిర్ధారించడానికి విమానంలో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి” అని విమానాశ్రయ అధికారి ఓ మీడియా సంస్థకు తెలిపారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. బాంబు బెదిరింపుకు సంబంధించిన సమాచారంపై అధికారులు విచారణ చేస్తున్నారు. విమాన ప్రయాణంలో భద్రతను నిర్ధారించడానికి అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. Also read: 370 మందిని కాల్చి చంపింది మీరు కాదా? : కాంగ్రెస్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం! #delhi #bomb-threat #flight #call #srinagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి