TGSRTC : మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశారు..మేము అడిగినంత మనీ ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలా వచ్చే వాట్సాప్ కాల్స్ (WhatsApp Calls) పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారని వారి తల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, అంతే కాకుండా మీ బిడ్డ మా వద్దే ఉందని అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆడపిల్లలను చంపేస్తామంటూ కిడ్నాపర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సజ్జనార్ వివరించారు.
పూర్తిగా చదవండి..Sajjanar : ఆడపిల్లను కిడ్నాప్ చేశారంటూ బెదిరింపు కాల్స్..జాగ్రత్త: సజ్జనార్!
విదేశీ ఫోన్ నంబర్‌తో సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ ద్వారా స్కూల్, కాలేజీలకు వెళ్లిన మీ ఆడపిల్లలను కిడ్నాప్ చేశామంటూ ఫేక్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
Translate this News: