తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయని ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా టీజీఎస్‌ఆర్టీసీ స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని తెలిపింది. అయితే జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను ఇటీవల కేంద్రం పెంచిందని.. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్‌లోని టోల్‌సెస్‌ను మాత్రమే సవరించినట్లు పేర్కొంది.
Also Read: రేపటిలోగా మంత్రులకు శాఖల కేటాయింపు-చంద్రబాబు
అలాగే ఈ సవరించిన టోల్ సెస్ అనేది జూన్ 3 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని.. వాస్తవాలు లేకుండా బస్ ఛార్జీలు పెరిగాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Also read: గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల