TG Formation Day: జూన్ 2న కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ సన్మానం.. మరి పెద్ద సారు వస్తారా?

జూన్ 2న తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ, ఉద్యమకారులతోపాటు కేసీఆర్‌ను సన్మానించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ వేడుకకు సార్ వస్తారా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.

New Update
TG Formation Day: జూన్ 2న కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ సన్మానం.. మరి పెద్ద సారు వస్తారా?

CM Revanth Reddy To Honour KCR: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. 2024 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేండ్ల గడుస్తున్న సందర్భంగా.. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (Telangana Formation Day) రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారందరినీ సన్మానించడానికి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. తెలంగాణ ప్రజల కళను సాకారం చేసిన సోనియా గాంధీతో (Sonia Gandhi) పాటు పలువురు ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేసీఆర్‌కు ఆహ్వానం పంపనున్నట్లు తెలుస్తోంది.

పరేడ్ గ్రౌండ్‌లో పదివేల మందితో..
ఈ మేరకు జూన్ 2న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో (Parade Ground) పదివేలమందితో ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇచ్చింది సోనియానే అనే భావన ప్రజల్లో కల్పించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. అలాగే బీఆర్ఎస్ నేత  కేసీఆర్‌కు అధికారికంగా ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. అంతేకాదు కేసీఆర్‌ను ఈ వేడుకలకు రప్పించి, స్వయంగా రేవంత్ సన్మానించేలా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌తోపాటు కోదండరాం, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్‌రెడ్డి, హరీష్‌రావు, బండి సంజయ్‌, విజయశాంతి, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగ సంఘ నేతల్ని సన్మానించేలా ప్లాన్‌ చేస్తోంది. ఈ వేడుకలకు అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి లేఖ రాయగా.. త్వరలో ఈసీ అనుమతి ఇస్తుందనే నమ్మకంతో ఉంది ప్రభుత్వం. ఇక సోనియాగాంధీని చీఫ్ గెస్టుగా పిలవాలని నిర్ణయించుకున్నప్పటికీ ఇంకా సోనియా తెలంగాణ షెడ్యూల్‌ ఖరారు కాలేదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Hyderabad: నగరం నడి రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన!

కేసీఆర్‌కు అవమానమేనని భావిస్తే..
ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ను పిలవడంపై ముందుగా బీఆర్ఎస్ నేతల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుని ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా నన్మానం చేసినా అది కేసీఆర్‌కు అవమానమేనని భావిస్తే ఆయన హాజరుకాకపోవచ్చు. సీఎం హోదాలో ఇప్పటికే యశోద హాస్పిటల్‌లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా రేవంత్ పరామర్శించిన విషయం తెలిసిందే. కానీ సన్మానాలకు సంబంధించిన అంశం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే రోజున ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని కూడా అధికారికంగా ఆవిష్కరించనున్నారు.

Advertisment
తాజా కథనాలు