Women Protest Over Bad Roads in LB Nagar: హైదరాబాద్ మహానగరంలో చిన్న వర్షానికే రహాదారులన్నీ జలమయమవుతున్నాయి. కొన్నిచోట్ల నడి రోడ్డుపై నీటి కుంటలు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గత రెండు రోజులుగా కురిసిన చిన్న వర్షానికే నాగోల్లోని ఆనంద్ నగర్లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైంది. అడుగడుగున గుంతలుండటంతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది. దీంతో అక్కడి కాలనీ వాసులంతా నడి రోడ్డుపై నిరసనకు దిగారు.
Hyderabad: నగరం నడి రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన!
చిన్న వర్షాలకే హైదరాబాద్, నాగోల్-ఆనంద్ నగర్లో రోడ్ల దుస్థితి దారుణంగా తయారైందంటూ ఓ మహిళా వినూత్న నిరసనకు దిగింది. నడిరోడ్డుపై గుంతల్లో నిలిచిన మురికి నీటిలో కూర్చొని ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి.
Translate this News: