Israel - Iran War: ఇజ్రాయెల్‌పై టెర్రర్ అటాక్

జెరూసలేంలో ఇజ్రాయెల్ పౌరులపై టెర్రర్ అటాక్ జరిగింది. అక్కడ ఒక స్ట్రీట్‌లో కారుతో దూసుకు వచ్చిన ఉగ్రవాదులు...విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే గన్ పేలకపోవడంతో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు.

Israel - Iran War: ఇజ్రాయెల్‌పై టెర్రర్ అటాక్
New Update

Terrorist Attack In Israel: ఒకవైపు ఇజ్రాయెల, ఇరాన్ ల మధ్య యుద్ధంతో ప్రపంచం అట్టుడుకుతోంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఇరాన్, ఇజ్రాయెల్‌లు తగ్గేదే లేదు అంటున్నారు.మరోవైపు ఇజ్రాయెల్ ప్రజల మీద టెర్రరిస్ట్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి. జెరూసలెంలోని ఒక ప్రాంతంలో సడెన్‌గా ఉగ్రవాదులు ఎంట్రీ ఇవ్వడమే కాకుండా కాల్పులు కూడా జరిపారు. హఠాత్తుగా అక్కడ ఒక వీధిలోకి వేగంగా ఒక కారు దూసుకుని వచ్చింది. కారును ఇష్టం వచ్చినట్టు నడుపుతూ దారిలో వెళుతున్న ప్రజల మీదకు కూడా దూసుకెళ్‌ళింది. దాని తర్వాత కారులోంచి ఉగ్రవాదులు దిగి కాల్పులు జరిపారు. అయితే సమయానికి గన్ పని చేయకపోవడంతో కాల్పులు జరగలేదు. దీంతో పెద్ద ముప్పు తప్పింది. ఎవరూ గాయపడడం కానీ, చనిపోవడం కానీ జరగలేదు.

సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు.. 

ఈ అటాక్ తాలూకా దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎంత ప్రయత్నించినా కాల్పులు జరలేకపోవడంతో ఉగ్రవాదులు అక్కడ నుంచి పారిపోయారు. కారును, గన్‌ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సీసీ కెమెరాల్లో కనబడిన దృశ్యాలను బట్టి ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇరాన్‌, హమాస్‌లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. హమాస్తతో కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్. అందులో భాగంగానే ఇరాన్ పై కూడా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో కౌంటర్‌గా అటాక్‌లతో ఇజ్రాయెల్‌ మీద టెర్రర్‌ గ్రూపులు విరుచుకుపడుతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఇజ్రాయెల్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Also Read:Kavitha: కవిత బెయిల్‌ పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

#iran #terror-attack #israel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe