Telangana Accidents : నెత్తురోడిన తెలంగాణ.. సూర్యాపేటలో 6, వరంగల్ లో నలుగురు.. తెలంగాణలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేటలో ఆరుగురు మృతి చెందగా..వరంగల్ లో నలుగురు విద్యార్థులు మరణించారు. By Bhavana 25 Apr 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Accident : తెలంగాణ(Telangana Accident) లో బుధవారం రాత్రి, గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు(Road Accident) జరిగాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేట(Suryapet) లో ఆరుగురు మృతి చెందగా.. వరంగల్(Warangal) లో నలుగురు విద్యార్థులు మరణించారు. సూర్యాపేటలో .. సూర్యాపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్ల కోదాడ దుర్గాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అతి వేగం, నిద్రలేమి కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ లో విద్యార్థులు.. వరంగల్ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. చనిపోయిన నలుగురు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వర్థన్నపేట మండలం ఆంకేరు వాగు వంతెన వద్ద ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రైవేట్ బస్సు ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లందు గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరణ తేజ్, పొన్నాల రవికుమార్ లు నలుగురు బైక్ పై వస్తూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ను ఢీకొన్నారు. కాంగ్రెస్ సభకు వెళ్లి తిరిగి వస్తున్న బస్సు ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో గణేశ్ బుధవారం విడుదలయిన ఇంటర్ ఫలితాల్లో పాస్ అయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నలుగురు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులు కావడంతో నాలుగు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also read: పోలింగ్ సమయాన్ని పెంచిన ఎన్నికల కమిషన్..ఎక్కడ..ఎందుకంటే! #surypet #dead #warangal #road-accident #students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి